BIG BREAKING: కేటీఆర్ కు హైకోర్టులో బిగ్ షాక్..

ఏసీబీ విచారణకు తనతో పాటు లాయర్లను కూడా అనుమతించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే.. కేటీఆర్ తో పాటు లాయర్లు కూర్చోవడానికి వీల్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

New Update
KTR HIGH COURT

ఏసీబీ విచారణకు తనతో పాటు లాయర్లను కూడా అనుమతించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే.. కేటీఆర్ తో పాటు లాయర్లు కూర్చోవడానికి వీల్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఏసీబీ ఆఫీస్ లో కేటీఆర్ కు దూరంగా లాయర్లు ఉండేందుకు అనుమతిస్తామని తెలిపింది. కేవలం కేటీఆర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను చూసేలా మాత్రమే లాయర్ కు విజిబుల్ పర్మిషన్ ఇస్తామని హైకోర్టు తెలిపింది. విచారణ లో ఏం ప్రశ్నలు అడుగుతున్నారో అడ్వకేట్ కి వినబడకుండా... కేవలం చూసేలా మాత్రమే పర్మిషన్ ఇస్తామన్నారు. న్యాయవాదికి కేటీఆర్ కనిపించేలా విజిబుల్ డిస్టెన్స్ కు ఏసీబీ ఆఫీసులో సౌకర్యం ఉందో లేదో చెప్పాలని  ఏఏజీని హైకోర్టు ఆదేశించింది. సాయంత్రం 4 గంటలకు చెబుతాం అని ఏఏజీ కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి నిర్ణయాన్ని సాయంత్రం 4 గంటలకు ప్రకటిస్తామని న్యాయస్థానం వెల్లడించింది. ఇందుకోసం ముగ్గురు లాయర్ల పేర్లు ఇవ్వాలని కేటీఆర్ ను ఆదేశించింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు