బాలకృష్ణకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్!

TG: హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఆయన సినిమా స్టూడియో కోసం ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్దమైనట్లు సమాచారం. ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది

BALA CM REVANTH
New Update

Bala Krishna Studios: సినీ నటుడు, ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఆయన సినిమా స్టూడియో నిర్మించుకోడానికి ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైనట్లు సమాచారం. ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్యకు బహుమతిగా ప్రభుత్వ భూమి ఇచ్చేందుకు రంగం సిద్దమైనట్లు అధికారిక వర్గాల నుంచి వస్తున్న సమాచారం.

ఇది కూడా చదవండి: నేను పోను బిడ్డో సర్కారు దవాఖానాకు: కేటీఆర్

ఇప్పటికే భూమి కేటాయింపుపై అధికారులు కార్యాచరణ చేపట్టినట్లు తెలుస్తోంది.  బాలకృష్ణ సినీ స్టూడియోకు భూ కేటాయింపుపై రెవెన్యూ శాఖ నుంచి ఇప్పటికే సీఎస్ కు ప్రతిపాదనలు వెళ్లాయని, ప్రస్తుతం సీఎస్వీటిని పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. అలాగే సమ్మక్క.. సారక్క గిరిజన విశ్వవి ద్యాలయానికి భూమి కేటాయింపు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది. కాగా నటుడు బాలకృష్ణకు ప్రభుత్వ భూమిని కేటాయించడంపై మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది.

ఇది కూడా చదవండి: వైసీపీ నేత సజ్జల అరెస్ట్‌పై కోర్టు కీలక తీర్పు!

మూసీ నిర్వాసితులకు అండగా..

మూసీ బఫర్, ఎఫ్టీఎల్ లో ఇళ్లు నిర్మించుకున్న వారికి.. వాటిని ఖాళీ చేసే సమయంలో డబుల్ బెడ్రూం ఇళ్లతో పాటు స్థలాలు కూడా ఇవ్వాలనే యోచనలో సీఎం రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో  కుటుంబానికి ఇంటి నిర్మాణం కోసం ఔటర్ రింగ్ రోడ్డు పక్కన 150 నుంచి 200 చదరపు గజాల స్థలం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ నెల 26న జరగబోయే కేబినెట్ భేటీలో దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా ఇచ్చే స్థలం విలువ రూ.25 లక్షల నుంచి రూ. 30 లక్షల దాకా ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇందుకు అవసరం అయ్యే 700 ఎకరాలను ప్రభుత్వం కేటాయించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై కూడా ఈరోజు జరిగే మంత్రి వర్గ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి:  సీఎం రేవంత్ సర్కార్‌కు ఊహించని షాక్!

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe