రూ.500 బోనస్ ఇచ్చే సన్న రకాలు ఇవే!

TG: ఎన్నికల హామీలో భాగంగా క్వింటాలు సన్న రకం ధాన్యానికి రేవంత్ సర్కార్ రూ.500 బోనస్ ప్రకటించింది. మొత్తం 33 సన్న రకాల వరి వంగడాలను కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన లిస్ట్‌ను విడుదల చేసింది.

Telangana Budget 2024: రైతులకు గుడ్ న్యూస్.. వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్
New Update

Paddy Bonus: ఎన్నికల హామీలో భాగంగా క్వింటాలు సన్న రకం ధాన్యానికి రేవంత్ సర్కార్ రూ.500 బోనస్ ప్రకటించింది. ఈ క్రమంలో ఏ రకం వంగడాలకు బోనస్ ఇస్తారనే సందేహంలో రాష్ట్ర రైతులు ఉన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. మొత్తం 33 రకాల సన్న రకాల వంగడాలు ఐకేపీ సెంటర్లలో కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఈ మేరకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు వ్యవసాయ శాఖ అధికారులు.

రైతులు ఆందోళన..

ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సన్న రకాల వరి వంగడాల్లో జై శ్రీరామ్ సూపర్ ఫైన్ రకం లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఎక్కువ శాతం మంది రైతులు గత కొన్ని ఏళ్లుగా ఈ పంటను వేయడమే. అలాగే ముఖ్యంగా తెలంగాణలో జై శ్రీరామ్ సన్న బియ్యానికి, వడ్లకు మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువ ఉంటోంది. కాగా ఇది కొనేందుకు రైస్ మిల్లర్లు ఎగబడుతుంటారు. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర, బోనస్ అంటే ఎక్కువ డబ్బు ఇచ్చి కొనుగోలు చేస్తుంటారు. ఇదే కాకుండా రైతులు కూడా వడ్లను పట్టించి బియ్యాన్ని బహిరంగ మార్కెట్ లో అమ్ముకొని లాభాలు ఆర్జిస్తుంటారు. కాగా దీనిపై వ్యవసాయ అధికారులు.. రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని..  జై శ్రీరామ్ వడ్లను కూడా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.

కొనుగోలు చేయనున్న వరి వంగడాలు...

■ సిద్ది (డబ్ల్యూజీఎల్ 44) 
■ కంపసాగర్ వరి-1 (కేపీఎస్ 2874) 
■ సాంబ మసూరి (బీపీటీ-5204) 
■ జగిత్యాల వరి-3 (జేజీఎల్ 27356) 
■ జగిత్యాల వరి-2 (జేజీఎల్ 28545) 
■ వరంగల్ సాంబ (డబ్ల్యూజీఎల్ 14)
■ వరంగల్ సన్నాలు (డబ్ల్యూజీఎల్ 32100) 
■ జగిత్యాల మసూరి (జేజీఎల్ 11470) 
■ పొలాస ప్రభ (జేజీఎల్ 384) 
■ క్రిష్ణ (ఆర్ఎన్ఆర్ 2458) 
■ మానేరు సోనా (జేజీఎల్ 3828) 
■ తెలంగాణ సోనా (ఆర్ఆఎన్ఆర్ 15048) 
■ వరంగల్ వరి- 1119 
■ కూనారం వరి-02 (కేఎన్ఎం 1638) 
■ వరంగల్ వరి-02 (డబ్ల్యుజీఎల్ 962) 
■ రాజేంద్రనగర్ వరి-4 (ఆర్ఎన్ఆర్ 21278) 
■ కూనారం వరి-1 (కేఎన్ఎం 733) 
■ జగిత్యాల సన్నాలు (జేజీఎల్ 1798) 
■ జగిత్యాల సాంబ (జేజీఎల్ 3844)
■ కరీంనగర్ సాంబ (జేజీఎల్ 3855) 
■ అంజన (జేజీఎల్ 11118) 
■ నెల్లూరు మసూరి (ఎన్ఎల్ఆర్ 34449) 
■ ప్రత్యుమ్న (జేజీఎల్ 17004) 
■ సుగంధ సాంబ (ఆర్ఎన్ఆర్ 2465) 
■ శోభిని (ఆర్ఎన్ఆర్ 2354) 
■ సోమ్నాథ్ (డబ్ల్యుజీఎల్ 347) 
■ ఆర్ఎన్ఆర్ 31479 (పీఆర్ సీ) 
■ కేపీఎస్ 6251 (పీఆర్సీ) 
■ జేజీఎల్ 33124 (పీఆర్ సీ) 
■ హెచ్ఎంటీ సోనా 
■ మారుతీరు సాంబ (ఎంటీయు 1224) 
■ మారుతీరు మసూరి (ఎంటీయు 1262) 
■ ఎంటీయు 1271

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe