తెలంగాణ కాంగ్రెస్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్ కు To-Let బోర్డ్ పెట్టి పెట్టిన పోస్ట్ చర్చనీయాంశమైంది. అమెరికాకు వెళ్లిపోయిన తాత.. లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన చెల్లి.. ఫార్ములా ఈ రేసు కేసులో జైలుకు వెళ్లనున్న అన్న అంటూ కేసీఆర్, కవిత, కేటీఆర్ పై ఆ పోస్టులో సెటైర్లు వేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇక లేదని.. ఎంపీ ఎన్నికల్లో సున్నా సీట్లు రావడమే ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా విమర్శలు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ట్వీట్ పై బీఆర్ఎస్ నేతలు ఎలా కౌంటర్ ఇస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: ED: కేటీఆర్‌కు బిగ్ షాక్.. మరో కేసు నమోదు
For Sale also Available pic.twitter.com/0Ntew6vffa
— Telangana Congress (@INCTelangana) December 20, 2024
మరో వైపు ఫార్ములా-ఈ రేసు అంశం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ అంశంపై తెలంగాణ ఏసీబీతో పాటు ఈడీ కూడా కేటీఆర్ ను ఏ1గా పేర్కొంటూ కేసు నమోదు చేసింది. అయితే.. ఏసీబీ కేసును క్వాష్ చేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేసిన న్యాయస్థానం 30 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని తెలంగాణ పోలీసులను ఆదేశించింది.
ఇది కూడా చదవండి: మెగా ఫ్యామిలీలో మళ్లీ చిచ్చు.. జగన్ ఫ్లెక్సీల్లో అల్లు అర్జున్ ఫొటోలు!
నేడు మరోసారి హైకోర్టుకు కేటీఆర్..
ఈడీ కేసు విషయమై కేటీఆర్ ఈ రోజు క్వాష్ పిటిషన్ ను దాఖలు చేసే అవకాశం ఉంది. కేటీఆర్ నిధులు గోల్ మాల్ చేశాడని.. ఆయన ఆదేశాలతోనే నిబంధనలు ఉల్లంఘించి నిధులను HMDA ట్రాన్స్ ఫర్ చేసిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇదంతా ప్రభుత్వ కుట్ర అని తాను ఎలాంటి తప్పు చేయలేదని కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు.