Congress Vs BRS: పిట్టల దొర మాటలు ఆపు.. కేసీఆర్ కు కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్

ఏడాదిగా అసెంబ్లీకి ఎందుకు రాలేదో కేసీఆర్ ప్రజలకు చెప్పాలని మల్లు రవి డిమాండ్ చేశారు. పిట్టల దొర మాదిరిగా మాట్లాడడం కేసీఆర్ కు అలావాటైందన్నారు. బీఆర్ఎస్ ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. కేసీఆర్ కుంభకర్ణుడి లాగా ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నాడన్నారు.

New Update

పిట్టల దొర మాదిరిగా కేసీఆర్ వ్యాఖ్యలున్నాయని కాంగ్రెస్ కీలక నేత, మల్లు రవి ఫైర్ అయ్యారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని.. ఆ పార్టీ నేతలు దొరికితే ప్రజలు కొట్టేలా ఉన్నారని ఈ రోజు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మల్లు రవి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఇన్ని రోజులు కుంభకర్ణుడి లాగా ఫామ్ హౌస్ లో నిద్రపోయాడన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ఇలా మాట్లాడడం అలవాటు అయిపోయిందన్నారు. గతంలో 100 సీట్లు గెలుస్తామని చెప్పారు.. చివరికి ఏమైందని ప్రశ్నించారు. ఏడాదిగా అసెంబ్లీకి ఎందుకు రాలేదో కేసీఆర్ ప్రజలకు చెప్పాలని మల్లు రవి డిమాండ్ చేశారు.

ప్రతిపక్షనేతగా ప్రభుత్వం కేసీఆర్ కు అన్ని సదుపాయాలు కల్పించిందన్నారు. బీఆర్ఎస్ ప్రజల సమస్యలపై పోరాటం చేయడం లేదని.. వారి అస్తిత్వం కొరకు పోరాటం చేస్తోందన్నారు. కేటీఆర్, హరీష్ రావు ఫెయిల్ అయ్యారని.. వారిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. కవిత కారణంగా లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం జైలుకు వెళ్లారన్నారు. ఇప్పుడు కేరళ సీఎం పరిస్థితి ఏంటో అని అన్నారు. కేరళ లిక్కర్ స్కాం గురించి కవిత సమాధానం చెప్పాలని మల్లు రవి డిమాండ్ చేశారు. 

ఉత్తర కుమార ప్రగల్భాలు: పీసీసీ చీఫ్ ఫైర్

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఫాం హౌస్‌లో కూర్చొని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. స్థానిక సంస్థల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో కేసీఆర్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ప్రజలు ఫాం హౌస్‌ పాలన... గడీల పాలన కోరుకోవడం లేదన్నారు. ప్రజా పాలన.. ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటున్నారన్నారు. పదేళ్ల కేసీఆర్‌ పాలనలో సాధించలేని ప్రగతిని కాంగ్రెస్‌ ఏడాది పాలనలో సాధించడంతో ఆయన దిక్కుతోచక మాట్లాడుతున్నారన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గద్దెదింపినా.. 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒక్క సీటూ దక్కకపోయినా కేటీఆర్ గుణపాఠం నేర్వలేదన్నారు. కేసీఆర్‌ ఫాం హౌస్‌లో పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు