BIG BREAKING: కొండా సురేఖ సంచలన ప్రకటన!

మీనాక్షి నటరాజన్, మహేష్‌ కుమార్ గౌడ్ తో తన ఇబ్బందులు చెప్పానని కొండా సురేఖ వెల్లడించారు. వారంతా కలిసి ఈ సమస్యకు పరిష్కారం తీసుకువస్తానని తనకు చెప్పానన్నారు. వారు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు.

New Update
Konda Surekha

ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్ గౌడ్ తో తన ఇబ్బందులు చెప్పానని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. వారంతా కలిసి ఈ సమస్యకు పరిష్కారం తీసుకువస్తానని తనకు చెప్పారన్నారు. వారు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. ఈ విషయాన్ని మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కే వదిలేస్తున్నాన్నారు. వారి ఆదేశాల ప్రకారమే నడుచుకుంటానన్నారు. నిన్నటి నుంచి కొండా సురేఖ చుట్టే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు సాగుతున్న విషయం తెలిసిందే. నిన్న ఆమె ఓఎస్డీని టర్మినేట్ చేయడంతో పాటు ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సురేఖ ఇంటికి వెళ్లడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో సురేఖ కూతురు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తన తల్లిని టార్గెట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్లు బీసీలను అణిచివేస్తున్నారని ఆరోపించారు. అనేక సార్లు రేవంత్ తన తల్లిని అవమానించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రిపై కేసులు మోపేందుకు కుట్ర జరుగుతోందన్నారు. తమకు కార్యకర్తలు అండగా ఉంటారన్నారు. 

మేడారం టెండర్లతో మొదలైన వివాదం..

తన జిల్లా అందులోనూ తన దేవాదాయ శాఖకు చెందిన మేడారం టెండర్లను తనకు ఏ మాత్రం తెలియకుండా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి అప్పగించడంపై ఇటీవల కొండా సురేఖ సీరియస్ అయ్యారు. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డిని సంప్రదించకుండా నేరుగా ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఆమె సిబ్బంది నేరుగా మీడియాకు తెలియజేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. సురేఖ తీరుపై హైకమాండ్ కు ఆయన నివేదిక పంపించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేడారం అభివృద్ధి పనులపై మంత్రి హోదాలో ఉండి వివాదం చేయడంపై రేవంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఈ క్రమంలో నిన్న ఆమె ఓఎస్డీని ఏకంగా టర్మినేట్ చేసింది ప్రభుత్వం. ఓ సిమెంట్ కంపెనీ ప్రతినిధులను సురేఖ ఓఎస్డీ రివాల్వర్ తో బెదిరించారన్న ఆరోపణలతో కేసు కూడా నమోదైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసేందుకు నిన్న రాత్రి పోలీసులు ఏకంగా సురేఖ ఇంటికి వెళ్లడం సంచలనంగా మారింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సురేఖ కూతురు సస్మిత వారిని అడ్డుకున్నారు. మంత్రి ఇంటికి పోలీసులు రావడం ఏంటని ప్రశ్నించారు. సురేఖ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓఎస్డీని వెంట పెట్టుకుని కారులో వెళ్లిపోవడం మరింత సంచలనంగా మారింది.

దీంతో ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించడం ఖాయమన్న ప్రచారం ఈ రోజు ఉదయం నుంచి జోరుగా సాగింది. ఆమె కూడా తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి. ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా సురేఖ రాకపోవడం ఈ వార్తలకు బలం చేకూర్చాయి. ఈ వివాదం ముగిసిపోతుందా? హైకమాండ్ ఈ అంశాన్ని ఎలా హ్యాండిల్ చేయనుంది? సురేఖపై చర్యలు ఉంటాయా? అన్న అంశాలపై ఒకటి లేదా రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

Advertisment
తాజా కథనాలు