/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ తెంగాణ కాంగ్రెస్ లో తీవ్ర విషాదం నెలకొంది. మహిళ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బ రూప గుండెపోటుతో మరణించారు. నల్గొండలోని తన నివాసంలో ఆమె ఈ రోజు ఉదయం అస్వస్థతకు గురి కాగా.. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. రూప మరణంపై మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. రెండ్రోజుల క్రితం యాక్టీవ్ గా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రూప ఆకస్మిక మరణంతో కాంగ్రెస్ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి.
మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బ రూప గారి ఆకస్మిక మృతి వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆమె మృతి పట్ల నా హృదయపూర్వక సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. దుబ్బ రూప గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
— Ponnam Prabhakar (@Ponnam_INC) November 7, 2025
Follow Us