BIG BREAKING: ఎమ్మెల్యే సామేలు చెప్పినట్లే జరిగింది.. మదర్ డెయిరీ ఎన్నికల్లో BRS క్లీన్ స్వీప్.. రచ్చ రచ్చ!

హయత్ నగర్ లో జరిగిన మూడు మదర్ డైరీ డైరెక్టర్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మూడింటికి రెండు స్థానాల్లో బీఆరెస్ అభ్యర్థులు రచ్చ లక్ష్మి నర్సింహా రెడ్డి, సుదగాని భాస్కర్ గౌడ్ విజయం సాధించారు. మరో స్థానంలో కర్నాటి జయశ్రీ విజయం సాధించారు.

New Update
Beerla Ilaiah Vs Mandula Samel

హయత్ నగర్ లో జరిగిన మూడు మదర్ డైరీ డైరెక్టర్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మూడింటికి రెండు స్థానాల్లో బీఆరెస్ అభ్యర్థులు రచ్చ లక్ష్మి నర్సింహా రెడ్డి, సుదగాని భాస్కర్ గౌడ్ విజయం సాధించారు. మరో స్థానంలో కర్నాటి జయశ్రీ విజయం సాధించారు. అనూహ్య ఫలితాలతో కంగుతిన్న కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య, యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై నిన్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ప్రెస్ మీట్ నిర్వహించారు. సొంత పార్టీకి చెందిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై తీవ్ర ఆరోపణలు చేశారు.

బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించే ప్రయత్నం జరుగుతోందని ధ్వజమెత్తారు.ఈ విషయమై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ యాదవ్, సీఎం రేవంత్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా పొత్తు ఎలా పెట్టుకుంటారంటూ ఐలయ్యను ప్రశ్నించారు. అయితే.. సామేలు నిన్న అనుమానం వ్యక్తం చేసినట్లుగానే కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలు కావడం.. బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడం ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

అధికారంలో ఉండి కూడా అభ్యర్థులను గెలిపించుకోలేకపోయామని తుంగతుర్తికి చెందిన ఎమ్మెల్యే సామేలు వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సామేలు మరోసారి ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయంపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. 

Advertisment
తాజా కథనాలు