/rtv/media/media_files/2025/06/29/tpcc-chief-mahesh-kumar-goud-2025-06-29-14-59-39.jpg)
TPCC Chief Mahesh Kumar Goud
తెలంగాణ కాంగ్రెస్ PAC సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై మంత్రులతో న్యాయ సలహా సంప్రదింపుల కమిటీని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తో చర్చించి కమిటీని ప్రకటించినట్లు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క ఈ కమిటీలో ఉంటారని టీపీసీసీ చీఫ్ తెలిపారు. దేశంలో నిష్ణాతులైన న్యాయ కోవిధులు, రాజ్యాంగ నిపుణులతో ఈ మంత్రుల కమిటీ సంప్రదించనుంది. మంత్రుల కమిటీ 26వ తేదీ లోగా స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ల అమలు అంశాలపై నివేదిక ఇవ్వాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.