/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-59-2-jpg.webp)
Somesh Kumar: తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే భూదాన్ ప్రభుత్వం భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణల దృష్ట్యా ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ను ఈడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులపై ఈడీకి ఫిర్యాదు అందింది. ఐఏఎస్‌లు నవీన్ మిట్టల్, మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పై ఈడీ కి బాధితులు ఫిర్యాదు చేశారు. కొండాపూర్ మజీద్ బండిలో 88 ఎకరాలను బాలసాయి ట్రస్ట్ కు ఓ కుటుంబం దానం చేసింది. భూపతి అసోసియేట్స్ కు 42 ఎకరాలు ఇస్తున్నట్లు 45 జీవో జారీ చేశారని బాధితులు ఈడీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ భూమికి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి.. ముగ్గురు ఐఏఎస్ అధికారులు మోసం చేశారని ఈడీకి బాధితులు ఫిర్యాదు ఇచ్చారు.