అలాంటోళ్లను పట్టించుకోవద్దు.. రాజగోపాల్ రెడ్డికి సీఎం రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్..

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో ఒకే కుర్చీలో కూర్చోవడానికి చాలా మంది పోటీ పడతారన్నారు. పదవి రాని వారు సృష్టించే అపోహలకు లోను కావొద్దన్నారు.

New Update
Komatireddy Raj Gopal reddy Vs Revanth Reddy

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇటీవల తరచుగా చేస్తున్న విమర్శలపై సీఎం రేవంత్ రియాక్ట్ అయ్యారు. ఈ రోజు హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగిన CREDAI ప్రాపర్టీ షోలో సీఎం మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఒకే కుర్చీలో కూర్చోవడానికి చాలా మంది పోటీ పడతారన్నారు. పది మంది పోటీ పడ్డప్పుడు మిగతా 9 మంది నిరాశ చెందుతారన్నారు. వాళ్ళు సృష్టించే అపోహలకు లోనై మీరు వేగంగా వ్యాపింపజేస్తే అది రాష్ట్రానికి, దేశానికి నష్టం కలిగిస్తాయన్నారు. 

ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇటీవల తరచుగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. పదేళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి అంటే.. అది కాంగ్రెస్ విధానం కాదంటూ కౌంటర్ ఇచ్చారు. అనంతరం సోషల్ మీడియా రిపోర్టర్లపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఫైర్ అయ్యారు. ఇలా అనడం సరికాదన్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులకు తాను అండగా ఉంటానన్నారు. 

ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు రాజగోపాల్ రెడ్డి. ఆ సమయంలో మునుగోడు టికెట్ తో పాటు పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి సైతం ఇస్తామని తనకు హామీ ఇచ్చిందని రాజగోపాల్ రెడ్డి అనేక సార్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచినా మంత్రివర్గంలో చోటు దక్కలేదు. దీంతో అసంతృప్తితో రగిలిపోతున్న రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి టార్గెట్ గా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. కొంత మంది తనకు మంత్రి పదవి రాకుండా కుట్రలు చేస్తున్నట్లుగా కూడా ఆరోపించారు.

ఒక ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవి ఇవ్వడం కుదరదని ఇప్పుడు అంటున్నారని.. ఈ విషయం తనకు హామీ ఇచ్చినటప్పుడు తెలియదా? అని కూడా ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు.. మరి నల్లగొండకు మూడు పదవులు ఇస్తే తప్పేంటని కూడా ధ్వజమెత్తారు. అయితే.. రేవంత్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్న కోమటిరెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ ను మాత్రం ఏమీ అనకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజాగా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 

Advertisment
తాజా కథనాలు