/rtv/media/media_files/TujzKZ5iZe9AW7TQLx6h.jpg)
తెలంగాణలోని రేవంత్ సర్కార్ ప్రభుత్వ రంగ సొసైటీలు, సంస్థలు, యూనివర్సిటీల ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. వారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులకు ఇచ్చినట్లుగానే వారికి సమానంగా మధ్యంతర భృతి (IR) ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యోగులకు మూల వేతనంపై 5 శాతం ఐఆర్ మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారి వేతనాలు భారీగా పెరగనున్నాయి. దీంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
శుభవార్త...
— The 4th Estate (@The4thestate_tv) November 29, 2024
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో సమానంగా ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సొసైటీలు, యూనివర్సిటీ ఉద్యోగులకు ఐఆర్ (ఇంటీరిమ్ రిలీఫ్) ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం.
మూల వేతనం పై 5% ఐఆర్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ. pic.twitter.com/qMrAuaFFEM