/rtv/media/media_files/2025/09/10/brs-party-1-2025-09-10-17-06-07.jpg)
త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే అంశంపై కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలంతా గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉండాలని అన్నారు. ప్రజలంతా అవకాశం ఇస్తే ఆ కుటుంబం మరోసారి గౌరవప్రదంగా సమాజంలో నిలుస్తుందన్నారు. దీంతో గోపినాధ్ కుటుంబానికే ఈ సారి బీఆర్ఎస్ టికెట్ అని పరోక్షంగా తేల్చి చెప్పారు కేటీఆర్.
ఒక మనిషి పైకి ఎంత గంభీరంగా కనిపించినా, అతని జీవితంలో ఏదో ఒక కష్టం తప్పక ఉంటుంది. మన మంగంటి గోపినాథ్ గారి కథ కూడా అంతే :- @KTRBRS 🥺 pic.twitter.com/pGPz08g1mY
— Captain Fasak 2.0🎯 (@2Captainparody) September 10, 2025
తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ డివిజన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని త్వరలోనే కేసీఆర్ ప్రకటిస్తారన్నారు. బీహార్ ఎన్నికలతో పాటుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నవంబర్ లో వచ్చే అవకాశం ఉందన్నారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ 30 వేల మెజార్టీతో విజయం సాధించేలా పని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బతుకమ్మ పండగకి జోర్దార్ పాటలు రాబోతున్నాయని చెప్పారు. గల్లీ, గల్లీ బతుకమ్మ పాటలు దద్దరిల్లాలన్నారు. వినాయక నిమజ్జనం రోజు సచివాలయం దగ్గర కేసీఆర్ పాటలతో ప్రజలు హోరెత్తించారన్నారు.
సర్దార్ కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు గోపీనాథ్ అండగా ఉన్నాడని గుర్తు చేశారు. ఈరోజు గోపినాథ్ కుటుంబానికే కష్టం వచ్చిందని.. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలంతా గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉండాలని కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కే అవకాశం ఉందన్నారు. కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూలగొట్టడమా? అని ప్రశ్నించారు. కూకట్ పల్లిలో ఇల్లు కులగొడతామని స్టిక్కర్ వేసినందుకు బుచ్చమ్మ అనే వృద్ధ మహిళ ఆత్మహత్య చేసుకుందన్నారు. పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మీ ఇల్లు మీరు కూలగొట్టుకున్న వాళ్ళు అవుతారని హెచ్చరించారు. మాదాపూర్ లో ఉండే రేవంత్ రెడ్డి, బ్రదర్ తిరుపతి రెడ్డి ఇంటికి హైడ్రా వెళ్లదని ఆరోపించారు. పెదోళ్ల ఇంటికి మాత్రం హైడ్రా వెళ్తుందన్నారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిచి తీరాల్సిందేనన్నారు.