BIG BREAKING: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అభ్యర్థిని బీఆర్ఎస్ ఫైనల్ చేసింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి సునీతను కేటీఆర్ తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. దమ్ముంటే మీ అభ్యర్థిని ప్రకటించాలని కాంగ్రెస్, బీజేపీకి సవాల్ విసిరారు.

New Update
BRS Jubilee Hills

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అభ్యర్థిని బీఆర్ఎస్ ఫైనల్ చేసింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి సునీతను కేటీఆర్ తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. దమ్ముంటే మీ అభ్యర్థిని ప్రకటించాలని కాంగ్రెస్, బీజేపీకి సవాల్ విసిరారు. తెలంగాణ భవన్‌లో ఈ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. 20 హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ జైత్రయాత్రతో ప్రజలు సురుకు పెట్టాలని కోరారు. పొరపాటున కాంగ్రెస్‌ను గెలిపిస్తే సంక్షేమ పథకాలు అమలు కావని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల జాయింట్ వెంచర్ రేవంత్ సర్కార్ అని ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిత్యం విమర్శించే మోదీ, అదానీలను సీఎం రేవంత్ వెనుకేసుకొస్తున్నాడని ధ్వజమెత్తారు. వక్ఫ్ సవరణలను దేశంలోనే తొలిసారిగా రేవంత్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. చరిత్రలో తొలిసారి ముస్లిం మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టేనని ఫైర్ అయ్యారు. రేపటి తెలంగాణ భవిష్యత్తును జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక డిసైడ్ చేయబోతోందన్నారు. కారు కావాలో కాంగ్రెస్, బీజేపీ బేకార్ గాళ్లు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు.  

Advertisment
తాజా కథనాలు