BIG BREAKING: నన్నే సస్పెండ్ చేస్తారా?.. కవిత సంచలన నిర్ణయం!

బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురి కావడంతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

New Update
MLC Kavitha BRS

MLC Kavitha BRS

బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురి కావడంతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించి ఈ మేరకు ప్రకటన చేసే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 

గత మేలో కవిత తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ కావడంతో వివాదం మొదలైంది. అనంతరం మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించిన కవిత.. ఆ లేఖ రాసింది తానేనని స్పష్టం చేశారు. తాను అనేక సార్లు తన తండ్రికి లేఖ రాశానని.. ఇప్పడు మాత్రమే లీక్ చేశారని ఫైర్ అయ్యారు. ఆ లేఖను లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విషయాన్ని పార్టీ పెద్దలు పట్టించుకోలేదు. అనంతరం రోజు రోజుకూ పార్టీపై విమర్శల దాడిని పెంచుతూ వస్తున్నారు కవిత. కేసీఆర్ నాయకత్వాన్ని తప్పా మరొకరి నాయకత్వాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె స్పష్టం చేశారు. తద్వారా కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకునేదే లేదని ఆమె స్పష్టం చేశారు.

జగదీష్ రెడ్డి నుంచి హరీష్ వరకు..

అనంతరం జగదీష్ రెడ్డి టార్గెట్ గా లిల్లీపుట్ అంటూ సీరియస్ కామెంట్లు చేశారు. ఆయన కారణంగానే నల్గొండ జిల్లాలో పార్టీ నాశనం అయ్యిందని ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలను పార్టీ సీరియస్ గా తీసుకుంది. అనంతరం కాళేశ్వరం కమిషన్ విచారణను తెలంగాణ సర్కార్ సీబీఐకి అప్పగించడంతో కవిత ఫైర్ అయ్యారు. హరీష్ రావు, సంతోష్ రావు కారణంగానే కేసీఆర్ కు ఈ అవినీతి మరక అంటిందంటూ కామెంట్స్ చేశారు. తద్వారా కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి జరిగిందని కవిత చెప్పినట్లు అయ్యింది. ఈ వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారానికి కారణమయ్యారు. కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ నిన్నటి నుంచి ముఖ్య నేతలతో చర్చిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణం తీసుకున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధికారిక ప్రకటన సైతం కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది.  

Advertisment
తాజా కథనాలు