/rtv/media/media_files/2025/06/02/Sm4apQYMJwJcn87kL1Q5.jpg)
Harish Rao Counter to mlc kavitha
బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని, కలుస్తదని కొందరు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ ఎమ్మెల్సీ కవితకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఈ విషయమై కేసీఆర్ ఇప్పటికే కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారన్నారు. బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి 100 స్థానాల్లో పైగా విజయం సాధించి అధికారంలోకి వస్తామన్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులకు, ఉద్యమకారులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు బీఆర్ఎస్ లీగల్ సెల్ అండగా ఉందని భరోసానిచ్చారు. అక్రమ కేసులు పెట్టి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న అధికారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎవరైనా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో వారి పేర్లు రెడ్ బుక్ లో రాసి పెట్టాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తించే అధికారులపై తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.
బీఆర్ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు..
— BRS Party (@BRSparty) June 2, 2025
ఒంటరిగానే పోటీ చేస్తుంది.
100 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తది.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish pic.twitter.com/rKONCc6BuE