BIG BREAKING: సీఎం రేవంత్ ను కలిసిన బీజేపీ ఎంపీ అర్వింద్.. అసలేం జరుగుతోంది?

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలవడం తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారింది. అయితే.. మర్యాదపూర్వకంగా కలిసినట్లు సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

New Update
MP Dharmapuri Arvind CM Revanth

రేవంత్ రెడ్డితో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్

జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కూడా ఉన్నారు. సంజయ్ గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయితే.. సడెన్ గా సంజయ్ తో కలిసి అర్వింద్ రేవంత్ రెడ్డిని ఎందుకు కలిశాడనే అంశం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. అర్వింద్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిజమాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోనే జగిత్యాల నియోజకవర్గం ఉంది. ఈ నేపథ్యంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం వీరు సీఎంను కలిశారా? లేకుంటే రాజకీయ అంశాలు ఏమైనా? ఉన్నాయ అంశంపై చర్చ సాగుతోంది. ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు ఇంకా ఈ అంశంపై స్పందించలేదు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు