/rtv/media/media_files/2025/07/07/bjp-ram-chander-rao-2025-07-07-14-36-30.jpg)
BJP Ram Chander Rao
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు పేర్లను తెలంగాణ బీజేపీ షార్ట్ లిస్ట్ చేసి హై కమాండ్ కు పంపినట్లు సమాచారం. లిస్ట్ లో లంకల దీపక్ రెడ్డి, జుటూరి కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ పేర్లు ఉన్నట్లు పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. అయితే ప్రధాన పోటీ మాత్రం లంకల దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి మధ్య ఉందని కమలం పార్టీలో చర్చ సాగుతోంది. ఈ లిస్ట్ తో రేపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. జాతీయ ముఖ్య నేతలతో సమావేశమై అభ్యర్థి పేరును ఖరారు చేయనున్నట్లు సమాచారం. పార్లమెంటరీ పార్టీ బోర్డు మీటింగ్ తర్వాత అభ్యర్థి ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.