/rtv/media/media_files/2025/01/10/IXSjbdD0NAkQz5xvklyT.jpg)
బంజారాహిల్స్ పీఎస్ లో మాజీ మంత్రి BRS Working President KTR పై కేసు నమోదైంది. నిన్న ఏసీబీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసులపై దుర్భాషలాడడం, న్యూసెన్స్, ట్రాఫిక్ సమస్యకు కారణయ్యారన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు. ACB ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్ వరకు అనుమతి లేకుండా ర్యాలీ తీయడంపై సైతం కేటీఆర్ పై పోలీసులు సీరియస్ అయ్యారు. ఆయనతో పాటు మరో 6 గురు పై కేసు నమోదు చేశారు. కేటీఆర్ తో పాటు బాల్క సుమన్, మన్నె గోవర్ధన్, జయసింహ, క్రిశాంక్, గెల్లు శ్రీనివాస్ పై కూడా కేసులు నమోదయ్యాయి. నిన్న మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో ప్రశ్నించిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి:
పోలీసులతో వాగ్వాదం..
అయితే విచారణ అనంతరం బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. దీంతో ట్రాఫిక్ జామ్ అవుతుందని.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కేటీఆర్ ను పోలీసులు ఆదేశించారు. ఈ క్రమంలో వారితో కాసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం కేటీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఈ ఘటనపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే.. నిన్న విచారణ అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానన్నానన్నారు. విచారణకు పూర్తిగా సహకరించినట్లు చెప్పారు. తనకు తెలిసిన సమాచారం అంతా ఏసీబీకి చెప్పానట్లు వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి రాసిచ్చిన 4-5 ప్రశ్నలనే అటు తిప్పి, ఇటు తిప్పి అడిగారని ఆరోపించారు. ఇదో అసంబద్ధమైన కేసు అని ఏసీబీ అధికారులకు చెప్పానన్నారు. మరో వైపు ఈ రోజు ఫామ్ హౌజ్ కు వెళ్లి తండ్రి కేసీఆర్ ను కలిశారు కేటీఆర్. ఏసీబీ కేసు, రాజకీయ పరిణామాలపై చర్చించారు. నిన్న జరిగిన విచారణ అంశాలను సైతం వివరించారు.