రేపే సద్దుల బతుకమ్మ .. సంబరాలతో మారుమోగనున్న తెలంగాణ తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకల్లో గౌరీదేవిని ఒక్కో రోజు ఒక్కో రూపంతో కొలుస్తారు. రేపు సద్దుల బతుకమ్మ అంటే చివరి రోజు. ఈ రోజు బతుకమ్మను ఆటపాటలతో గంగమ్మ ఒడికి చేరుస్తారు. సత్తుపిండి, పెరుగన్నం, పులిహోర, మలీద ముద్దలు, కొబ్బరన్నం దేవికి నైవేద్యంగా సమర్పిస్తారు. By Archana 09 Oct 2024 in తెలంగాణ కరీంనగర్ New Update Bathukamma 2024 షేర్ చేయండి Bathukamma 2024: తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లా, ప్రతి గ్రామంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా జరుపుకునే బతుకమ్మను తొమ్మిరోజుల పాటు కనుల పండువగా జరుపుకుంటారు. చిన్నా, పెద్దా అంతా రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో సందడి చేస్తారు. ఈ పండగ వేళ ప్రతీ ఇల్లు ఆడపడుచులు, చిన్నారుల చిరునవ్వులు, బంధుమిత్రులతో కోలాహలంగా ఉంటుంది. తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకల్లో గౌరీ దేవిని రోజుకో రూపంతో కొలుస్తారు. రేపు తొమ్మిదో రోజు అంటే చివరి రోజు. ఈ రోజున అమ్మవారిని సద్దుల బతుకమ్మ'గా అభివర్ణిస్తారు. సద్దుల బతుకమ్మ ప్రత్యేకతలు.. ఇక చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు సందడి మామూలుగా ఉండదు.. పల్లె, పట్టణాలు సంబరాలతో హోరెత్తి పోతాయి. ప్రత్యేక నైవేద్యాలు, ఆటపాటలతో బతుకమ్మ మీద కొలువైన గౌరమ్మను ఆ తల్లి గంగమ్మ ఒడికి చేర్చి.. మళ్లీ ఏడాది వరకు బతుకమ్మ కోసం ఎదురుచూసే రోజు ఇది. సద్దుల బతుకమ్మ నాడు అమ్మవారికి సత్తుపిండి, పెరుగన్నం, పులిహోర, మలీద ముద్దలు, కొబ్బరన్నం, నువ్వులన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి, మందారం, గుమ్మడి తీరొక్క పూలతో బతుకమ్మను ఏడు వరుసలుగా బతుకమ్మను పేర్చడం అయ్యాక.. పైన పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి పూజిస్తారు. సాయంకాలం ఊరంతా బతుకమ్మలను ఒక చోట చేర్చి.. వాటిని మధ్యలో పెట్టి.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో...., ఒక్కేసి పువ్వేసి చందమామ... ఒక్కజాములాయే చందమామ... అంటూ బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటాలు వేస్తారు. అనంతరం ఊరంతా బతుకమ్మలను తల పై పెట్టుకొని చెరువు వైపు వెళ్తారు. చెరువు దగ్గరకు వచ్చాక బతుకమ్మను గంగమ్మ ఒడిలో జారవిడుస్తారు. ఆ తర్వాత ఆడపడుచులంతా దేవికి సమర్పించిన సత్తుపిండి, పెరుగన్నం, పులిహోర, మలీద ముద్దలు, కొబ్బరన్నం, నువ్వులన్నం నైవేద్యాన్ని ఒకరికొకరు తినిపించుకుంటారు. Also Read: రోజొక్క తీరు.. రేపు ఏడో రోజు వేపకాయల బతుకమ్మ.. నైవేద్యం ఇలా చేయండి మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి