/rtv/media/media_files/2026/02/13/uttam-2026-02-13-11-39-14.jpg)
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో గులాబీ జెండా రెపరెపలాడింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత ఇలాకాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడి ఓటర్లు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపడంతో మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో కైవసం చేసుకుంది.
బీఆర్ఎస్ అభ్యర్థులు లక్ష్మి (1వ వార్డు), జక్కుల రమేష్ (2వ వార్డు), కారుపోతుల సోమలక్ష్మి (3వ వార్డు), శకుంతల (4వ వార్డు) వరుస విజయాలతో దూసుకుపోయారు. అలాగే 10వ వార్డు నుండి యాకూబ్, 11వ వార్డులో గోవిందమ్మ, 12వ వార్డులో గీత, 13వ వార్డులో జ్యోతి, 14వ వార్డులో సంకెపల్లి రఘునందన్, 15వ వార్డులో త్రిశూల్ విజయం సాధించి బీఆర్ఎస్ పట్టును సుస్థిరం చేశారు.
కాంగ్రెస్ పార్టీ కేవలం నాలుగు వార్డులకే (6, 7, 8, 9 వార్డులు) పరిమితమైంది. 5వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి శివరాత్రి వెంకన్న విజయం సాధించారు. మంత్రి ఉత్తమ్ సొంత మండలంలో కాంగ్రెస్ ఓటమి పాలవ్వడం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ కార్యకర్తలు తిరుమలగిరిలో బాణాసంచా కాల్చి భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కాగా ఉత్తమ్ స్వగ్రామం సూర్యాపేట జిల్లాకు చెందిన తిరుమలగిరి మండలంలోని తాటిపాముల.
Follow Us