New Update
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణను ఏప్రిల్ 2కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. బీఆర్ఎస్ తరఫున లాయర్లు ఈ రోజు రెండు గంటల పాటు సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఏప్రిల్ 2న స్పీకర్,అసెంబ్లీ సెక్రటరీ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. అనంతరం న్యాయస్థానం తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ రోజే తీర్పు వస్తుందన్న చర్చ జరిగింది. దీంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేల్లో హైటెన్షన్ నెలకొంది. విచారణను వాయిదా వేయడంతో.. తర్వాత ఏం జరగబోతుందనే అంశంపై వారు న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు.
తాజా కథనాలు