BIG BREAKING: ఎమ్మెల్సీగా కోదండరాం ఎన్నిక రద్దు.. రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు బిగ్ షాక్!

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకం చెల్లదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దాసోజు, సత్యనారాయణ పిటిషన్లపై సుప్రీం ఈ మేరకు తీర్పునిచ్చింది. 

New Update
Supreme Court MLC

సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ ఇచ్చింది. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ను ఎమ్మెల్సీగా నియమించడంపై స్టే విధించింది. వీరి నియమకాన్ని నిలిపివేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నిక చేసింది. వివిధ కారణాలను చూపుతూ అప్పటి గవర్నర్ తమిళిసై వీరి నియామకానికి సంబంధించిన ఫైల్ ను తిరస్కరించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ వీరిద్దరి స్థానంలో ప్రొఫెసర్ కోదండరాం, అలీ ఖాన్ ను ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ గవర్నర్ కు ఫైల్ పంపించింది. గవర్నర్ ఆమోదంతో వీరిద్దరు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. అయితే.. ఈ అంశంపై దాసోజు శ్రవణ్ న్యాయపోరాటం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా ఈ తీర్పు ఇవ్వడం సంచలనంగా మారింది.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ నేత క్రిషాంక్ స్పందించారు. తెలంగాణలో గవర్నర్ నియామకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదన్నారు. భవిష్యత్తులో బీజేపీ గవర్నర్ల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఈ తీర్పు ఒక ఉదాహరణగా నిలుస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా గవర్నర్‌కు సిఫార్సు చేసిందని గుర్తు చేశారు. అయితే.. బీఆర్ఎస్ గవర్నర్‌తో ఉన్న అభిప్రాయబేధాల కారణంగా అప్పటి గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ మొదట వారికి నియామకాలు ఇవ్వడంలో జాప్యం చేశారని ఆరోపించారు.

ఆ తర్వాత ప్రభుత్వం మారి రేవంత్ రెడ్డి సీఎంగా నియమితులయ్యారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, బీజేపీతో ఉన్న సత్సంబంధాల కారణంగా గవర్నర్ ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను ప్రొఫెసర్ కోదండరామ్, అలీ ఖాన్‌కు కేటాయించారన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతుతో దాసోజ్ శ్రవణ్ న్యాయ పోరాటం చేశారన్నారు. ఫలితంగా అప్పటి గవర్నర్ తమిళి సై చేసిన అక్రమ నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేస్తూ తీర్పునిచ్చిందన్నారు.

Advertisment
తాజా కథనాలు