RTVపై శ్రీచైతన్య రౌడీయిజం.. లోపాలు బయటపడతాయన్న భయంతో..

ఆర్టీవీపై శ్రీచైతన్య కాలేజీ నిర్వాహకులు దౌర్జన్యం ప్రదర్శించారు. సమస్యలు ఉన్నాయని విద్యార్థులు సంప్రదించడంతో కాలేజీకి వెళ్లిన ఆర్టీవీ ప్రతినిధిని బలవంతంగా బయటకు పంపించారు. తమ లోపాలు ఎక్కడ బయటపడుతాయన్న భయంతో దౌర్జన్యానికి పాల్పడ్డారు.  

author-image
By Nikhil
New Update

శ్రీచైతన్య కాలేజీలో లోపాలు ఒక్కొక్కటి భయటపడుతున్నాయి. వందల మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగిన ఘటనతో మహిళా కమిషన్ నేరెళ్ల శారద ఈ రోజు మాదాపూర్ శ్రీచైతన్య కాలేజీతో తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థినులు కాలేజీలో అనేక సమస్యలు ఉన్నాయని ఆర్టీవీకి సమాచారం అందించారు.

బలవంతంగా బయటకు..

అసలు విషయం తెలుసుకునేందుకు కాలేజీకి వెళ్లిన ఆర్టీవీ ప్రతినిధులపై మాదాపూర్ శ్రీచైతన్య కాలేజీ నిర్వాహకులు దౌర్జన్యం ప్రదర్శించారు. బలవంతంగా బయటకు పంపించారు. తమ కాలేజీలో ఉన్న లోపాలు ఎక్కడ బయటపడుతాయన్న భయంతోనే మీడియాపై ఇలా దౌర్జన్యానికి పాల్పడ్డారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. లక్షల ఫీజులు వసూలు చేస్తూ.. విద్యార్థులకు కనీస సదుపాయాలు కల్పించకుండా ఇబ్బంది పెడుతున్న కార్పోరేట్ కాలేజీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలన్న డిమాండ్ లు వస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు