/rtv/media/media_files/2026/02/25/kummera-incident-2026-02-25-13-55-58.jpg)
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న కుమ్మెర కుల వివక్ష కొట్లాటలో పోలీసులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. నాగర్ కర్నూల్ డీఎస్పీ ప్రెస్‌మీట్‌లో కీలక వివరించారు. ఈ కేసులో రాజకీయ, సామాజిక కోణాలు వినిపిస్తున్న తరుణంలో, అసలు ఏం జరిగిందనే అంశంపై ఆయన స్పష్టతనిచ్చారు.
డీఎస్పీ కథనం ప్రకారం.. దర్శనం క్యూలైన్‌లో నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి, బాధితులకు మధ్య తొలుత గొడవ మొదలైంది. తర్వాత కొబ్బరికాయల దుకాణం వద్ద శ్రీనివాస్ రెడ్డికి, పాప తండ్రి గణేష్‌కు మధ్య వాగ్వాదం పెరిగింది. ఈ గొడవలో ఇరు వర్గాలు పరస్పరం దూషించుకున్నాయని, ఈ క్రమంలో శ్రీనివాస్ రెడ్డి తలకు బలమైన గాయాలయ్యాయని ఆయన తెలిపారు. గొడవ సమయంలో పాప నిజంగా అక్కడ ఉందా అనే దానిపై పోలీసులు ఎక్వైరీ చేస్తున్నారు.
పోలీసుల వెర్షన్.. పాప మృతిపై ఉత్కంఠ
ఘటన జరిగిన తర్వాత ఇరువర్గాలు స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నాయి. అయితే, ప్రాథమిక ఫిర్యాదులో పాప అంశం గానీ, ఆమె సామాజిక వర్గం గురించి గానీ బాధితులు ప్రస్తావించలేదని డీఎస్పీ పేర్కొన్నారు. అలాగే చిన్నారి మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టం రిపోర్టులో ఆమె శరీరంపై లేదా లోపల ఎటువంటి గాయాలు లేవని ప్రాథమికంగా తేలిందని ఆయన వెల్లడించారు. పాపను తాను తన్నలేదని నిందితుల్లో ఒకరైన మధుసూధన్ రెడ్డి చెబుతున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే మరిన్ని నిజాలు తెలుస్తాయని డీఎస్పీ చెప్పారు.
విచారణ వేగవంతం
ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం లేదని, బాధితులను బెదిరించలేదని డీఎస్పీ స్పష్టం చేశారు. "ఘటన సమయంలో అక్కడ చిన్నారి, ఆమె తల్లి ఉన్నారా లేదా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. గ్రామస్తులు, సాక్షులందరినీ విచారించి త్వరలోనే ఒక నిర్ధారణకు వస్తాం" అని ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ ప్రకటించారు.
Follow Us