BREAKING: కేటీఆర్‌పై కేసు నమోదు! TG: కేటీఆర్‌పై సామ రామ్మోహన్ రెడ్డి పీఎస్‌లోఫిర్యాదు చేశారు. మూసీ ప్రక్షాళనకు రూ.1.50లక్షల కోట్లు కేటాయించారని, అందులో రూ.25వేల కోట్లు ఢిల్లీ పెద్దలకు దోచి పెట్టేందుకేనని కేటీఆర్ చేసిన ఆరోపణపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. By V.J Reddy 02 Oct 2024 in తెలంగాణ కరీంనగర్ New Update షేర్ చేయండి MLA KTR: మాజీ మంత్రి కేటీఆర్‌పై పోలీస్ స్టేషన్‌లో పీసీసీ మీడియా కోఆర్డినేషన్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. మూసీ ప్రక్షాళనకు రూ.1.50లక్షల కోట్లు కేటాయించారని, అందులో రూ.25వేల కోట్లు ఢిల్లీ పెద్దలకు దోచి పెట్టేందుకేనని కేటీఆర్ చేసిన ఆరోపణపై ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానంపై తప్పుడు ఆరోపణలు చేసిన కేటీఆర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. Sama Rammohan Reddy filed a complaint against KTR at the police stationKTR పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సామ రామ్మోహన్ రెడ్డిమూసీ ప్రక్షాలనకు 1లక్ష 50 వేల కోట్ల రూపాయలు కేటాయించారని అందులో 25 వేల కోట్లు ఢిల్లీ పెద్దలకు దోచి పెట్టేందుకే ప్రణాళిక చేశారని ముఖ్యమంత్రి పైన… pic.twitter.com/SIehJ4WzEw — Congress for Telangana (@Congress4TS) October 2, 2024 తెలంగాణ సొమ్ము.. ఢిల్లీకి... హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ కోసమే హైడ్రా కూల్చివేతలు చేస్తుందని అన్నారు. డబ్బు సంచుల కోసమే మూసీ ప్రాజెక్ట్‌కు రాహుల్ గాంధీ అనుమతి ఇచ్చాడని ఆరోపించారు. హైడ్రాను నడిపిస్తోంది రేవంత్ కాదు, రాహులే అని అన్నారు. పేదల ఇళ్లపైకి బుల్డోజర్లను పంపిస్తోంది రాహులే అని మండిపడ్డారు. బుల్డోజర్ ప్రభుత్వంతో హైదరాబాద్‌లో ప్రజలు చచ్చిపోతుంటే రాహుల్ గాంధీ ఎక్కడ చచ్చిపోయాడు అని విమర్శించారు. ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు, మూసీ లూటీఫికేషన్ అని నిప్పులు చెరిగారు. ఎక్కడున్నావ్ రాహుల్? తెలంగాణలో చిన్నపిల్లోడు పిలిచినా సరే వస్తానన్న రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ సచ్చాడో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఢిల్లీ డబ్బుల కట్టల కోసమే రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం పేదల ఇళ్లను కూల్చేయిస్తోందని ఆరోపించారు. మీరు ఈ ప్రాజెక్ట్ ఏ కాంట్రాక్టర్‌కు ఇస్తారో కూడా తమకు తెలుసు అని అన్నారు. ఆ వివరాలను త్వరలోనే బయటపెడతానని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానానికి మూసీ నోట్ల కట్టలు కావాలని అన్నారు.మరి మూసీ బాధితుల కష్టాలు కాంగ్రెస్ అధిష్టానానికి పట్టవా అని ప్రశ్నించారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి