Right to Information Act : బీఆర్‌ఎస్‌ పాలనలో నిర్లక్ష్యమైన సమాచార హక్కు చట్టం

బీఆర్‌ఎస్‌ పాలనలో సమాచార హక్కు చట్టం నిర్లక్ష్యానికి గురైందని యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ కాంపెయిన్ కరీంనగర్ జిల్లా కన్వీనర్ గూడూరి స్వామి రెడ్డి( లోక్ సత్తా) ఆరోపించారు. ఈ రోజు ఆయన రాష్ట్ర సమాచార  కమిషనర్లైన P V. శ్రీనివాసరావు, మొహసీనా పర్వీన్ లను కలిశారు.

New Update
FotoJet (96)

Swamy Reddy submitting a petition to the Information Commissioners

Right to Information Act :  గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో సమాచార హక్కు చట్టం నిర్లక్ష్యానికి గురైందని యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ కాంపెయిన్  తెలంగాణ, కరీంనగర్ జిల్లా కన్వీనర్ , గూడూరి స్వామి రెడ్డి( లోక్ సత్తా) ఆరోపించారు. ఈ రోజు ఆయన రాష్ట్ర సమాచార  కమిషనర్లైన P V. శ్రీనివాసరావు, మొహసీనా పర్వీన్ లను కలిశారు. ఈ సందర్భంగా వారికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం సమాచార హక్కు చట్టం 2005 అమలులో  నిర్లక్ష్యం వహించి ఈ యొక్క చట్టం అమలు చేయకుండా జిమ్మిక్కులు చేసిందన్నారు. చట్టం అమలులో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించిందన్నారు. అయితే UF-RTI కాంపెయిన్ పౌర హక్కులు కోరుకునే ప్రజాస్వామ్య వాదులందరూ, మన రాష్ట్రంలో ఉన్న స్వచ్ఛంద ఉద్యమ సంస్థలన్నీ ఐక్యంగా ప్రజలను చైతన్య పరుస్తూ, వివిధ రూపాలలో పోరాటాలను ఉధృతంగా చేస్తూ కార్యక్రమాలు నిర్వహించాయన్నారు. రాష్ట్రంలో అవినీతి, కుంభకోణాలను సమాచార హక్కు చట్టం ద్వారా బయట పెడుతుంటే పరోక్షంగా ప్రత్యక్షంగా,మానసికంగా అధికారికంగా అనధికారికంగా ప్రజా ప్రయోజనాల కొరకు ఉద్యమిస్తున్న స.హా ఉద్యమ కార్య కర్తలపై దాడులు చేశారన్నారు. కేవలం నేతి బీరకాయలో నెయ్యి ఉన్నదెంత నిజమో గత బీఆర్ ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సమాచార హక్కుచట్టం కూడా అంతేనని ఎద్దేవా చేశారు. చివరకు రాష్ర్టంలో  రాష్ట్ర కమిషనర్లు లేకుండా చేసి ప్రజల చేతిలో ఓటమి పాలయ్యారని స్వామిరెడ్డి ఆరోపించారు. తాజా కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో భాగంగా రాష్ట్ర సమాచార హక్కు చట్టం 2005 రాష్ట్ర చీఫ్‌ ఇన్ఫర్మేషన్ కమిషన్, కమిషనర్లను ఏర్పాటు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. 

కాగా ఈ సందర్భంగా ఆయన కమిషనర్లకు వినతిపత్రం అందజేశారు. అందులో  ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో పదవ  తరగతిలో  సమాచార హక్కు చట్టం సక్సెస్ స్టోరీ ని పాఠ్యంశంగా పెట్టారని. దానిని బిఆర్ఎస్ ప్రభుత్వం తొలగించిందని ఆరోపించారు. అట్టి పాఠ్యాంశాన్ని తిరిగి మరల కొనసాగించాలని కోరారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీ.వో ఆర్ టి. నో.ఓ 11 85 జనరల్ అడ్మినిస్ట్రేషన్ (జిపిఎం మరియు ఏ ఆర్ )డిపార్ట్మెంట్ తేదీ /12- 3- 2013 ప్రకారం రాష్ట్రస్థాయిలో మరియు జిల్లా స్థాయిలో హైపపర్ కమిటీలు వేస్తూ, సభ్యులను నియమించి చట్టం అమలుపై సమీక్ష సదస్సులు నిర్వహించాలన్నారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం అమలు అభివృద్ధికై వివిధ శాఖలకు ఒక శాతం బడ్జెట్ కేటాయించాలన్నారు. చట్టం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులకు చట్టపరమైన శిక్షలను కఠిన తరం చేయాలన్నారు.  ప్రభుత్వం ప్రతి శాఖ కార్యాలయంలో సీసీ కెమెరాలను తప్పనిసరి చేస్తూ, వీడియో పుటేజీ సమాచారాన్ని భద్రపరుస్తూ సమాచారం ఇవ్వడంలో సాంకేతిక లోపాలు లేకుండా చూడాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆఫీసులలో బోర్డులు తప్పనిసరి చేయాలి. అవినీతి ఆక్రమాలపై సమాచార హక్కు చట్టం ఉపయోగించి సమాజ ప్రజా ప్రయోజనాల కొరకు పాటుపడుతున్న దరఖాస్తుదారులకు పరోక్ష  బెదిరింపులు లేకుండా రక్షణ ఏర్పాటు ఉండాలన్నారు.కమిషన్ వ్యవస్థను దరఖాస్తుదారులకు సత్వరమైన పారదర్శకమైన సమాచారం ఇప్పించే విధంగా మెరుగుపరచాలన్నారు. 

ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి నెల మూడో వారంలో ప్రత్యేకంగా ఒకరోజు సహా దరఖాస్తుదారుల సమస్యల పరిష్కారం రోజుగా ఉండాలని మేము కోరుకుంటున్నామన్నారు. నిర్ణీత సమయంలో" పి ఐ ఓ '"సమాచారం ఇవ్వకుండా కాలయాపనతో ఆ సమాచారం పొందడానికి రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్( ఆర్ టి ఆర్ట్ 2005 సెక్షన్ 19(3 )వద్దకు వెళ్లినట్లయితే అందుకు సంబంధించిన దరఖాస్తుదారుని ప్రయాణ ఖర్చులను ఆయా సంబంధించిన శాఖలు చెల్లించేటట్లు చేయలని డిమాండ్‌ చేశారు. అనంతరం  సమాచార కమిషనర్లతో కలిసి యునైటెడ్ ఫోరంపర్ ఆర్టీఐ కాంపెయిన్ తెలంగాణ క్యాలెండర్ లను ఆవిష్కరింపజేశారు. కాగా స్వామిరెడ్డి డిమాండ్లపై స్పందిచంచిన కమిషనర్లు పై విషయాల గురించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ప్రభుత్వ ఆఫీసులలో వెంటనే బోర్డులు ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  హుజురాబాద్‌ ADA  సునీత, మురళీధర్ దేశ్ పాండే,, మహబూబ్‌ నగర్ జిల్లా కన్వీనర్‌.జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisment
తాజా కథనాలు