Telangana: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క , ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు తో కలిసి సీఎం రేవంత్ సమావేశమయ్యారు.
Also Read: గొంతులో ఏదైనా ఇరుక్కుందా..అయితే కంగారు పడొద్దు..ఇలా చేయండి చాలు!
ఉద్యోగుల డీఏ చెల్లింపు విషయంపై శుక్రవారం సాయంత్రంలోగా నిర్ణయం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.ఉద్యోగులకు సంబంధించి వివిధ సమస్యల పరిశీలన కోసం కేబినేట్ సబ్ కమిటీని నియమించారు.ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్ సభ్యులుగా, కేశవరావు ప్రత్యేక ఆహ్వానితులుగా కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.
Also Read: సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకం
దీపావళి తర్వాత శాఖల వారిగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కేబినేట్ సబ్ కమిటీ సమావేశమవుతుంది.జీవో 317 పై మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే సమర్పించిన నివేదికపై కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.జేఏసీ ప్రతినిధులతో జరిగిన సమావేశాల్లో ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.