ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పరారీలో ఉన్న SIB మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్ పోర్టులను అధికారులు రద్దు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఉన్న సంగతి తెలిసిందే.

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో రాధాకిషన్ రావుకు రిమాండ్‌
New Update

Phone Tapping Case: తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పరారీలో ఉన్న SIB మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్ పోర్టులను అధికారులు రద్దు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఉన్న సంగతి తెలిసిందే. అమెరికాలో తలదాచుకున్నారంటూ వీరిద్దరి పాస్ పోర్టులు రద్దు చేయాలని పాస్ పోర్ట్ ఆఫీస్ కు పోలీసులు లేఖ రాశారు.

ఇది కూడా చదవండి: నేను పోను బిడ్డో సర్కారు దవాఖానాకు: కేటీఆర్

పోలీసుల నివేదిక ఆధారంగా ప్రభాకర్ రావు, శ్రవణ రావు పాస్ పోర్టు అధికారులు రద్దు చేశారు. కాగా ఇప్పటికే వీరిద్దరిపై లుక్ అవుట్ నోటీసులు ఉన్న సంగతి తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల, మంత్రుల, మాజీ మంత్రులతో కీలక అధికారుల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్న క్రమంలో దీనిపై కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనిపై విచారణ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. 

ఇది కూడా చదవండి: వైసీపీ నేత సజ్జల అరెస్ట్‌పై కోర్టు కీలక తీర్పు!

కొత్త చర్చకు నాంది...

టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన ప్రభాకర్ రావు హైదరాబాద్ కు వచ్చారని.. ఆయన కోర్టులో లొంగిపోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఆయన చెప్పే వివరాల ఆధారంగా అరెస్టులు ఉంటాయన్న టాక్ నడిచింది. అయితే.. ప్రభాకర్ రావు అసలు హైదరాబాద్ కే రాలేదని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. దీంతో ఈ చర్చకు బ్రేక్ పడింది. దీంతో మరెవరి అరెస్టు ఉండబోతుందనే అంశంపై చర్చ సాగుతోంది. ప్రస్తుతం కాళేశ్వరంతో పాటు విద్యుత్ కొనుగోళ్లపై చర్చ సాగుతోంది. 

ఇది కూడా చదవండి:  సీఎం రేవంత్ సర్కార్‌కు ఊహించని షాక్!

ఇంకా ఫోన్ ట్యాపింగ్ పై సైతం విచారణ కీలక దశకు చేరుకుంది. మరో వైపు గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా రేసులో సైతం అక్రమాలు జరిగాయని రేవంత్ సర్కార్ చెబుతోంది. ఈ అంశంపై సైతం ఏసీబీ సైతం రంగంలోకి దిగనుంది. ఇవన్నీ గత కేసీఆర్ ప్రభుత్వ హాయంలో జరిగినవే కావడం గమనార్హం. తాను జైలుకు వెళ్లానికి సిద్ధమని నిన్న అదిలాబాద్ మీటింగ్ లో కేటీఆర్ వ్యాఖ్యానించడం సైతం చర్చనీయాశమైంది. పొంగులేటి కామెంట్ల నేపథ్యంలోనే ఆయన ఇలా అన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe