సొంత ఇలాకాలో సీఎం రేవంత్‌కు షాక్! TG: సొంత జిల్లాలో సీఎం రేవంత్‌కు ఊహించని షాక్ తగిలింది. ఫార్మా కంపెనీ ఏర్పాటు కొరకు భూసేకరణ చేస్తున్న ప్రభుత్వానికి రైతులు షాక్ ఇచ్చారు. లగచర్ల రైతులు తమ వ్యవసాయ భూమిని ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీనిపై వారు ఆందోళనకు దిగినట్లు సమాచారం. By V.J Reddy 13 Nov 2024 in తెలంగాణ మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి సొంత జిల్లాలోనే ఊహించని షాక్ తగిలింది. గత కొన్ని ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని తన సొంత జిల్లా పాలమూరును.. తాను సీఎం అయ్యాక అభివృద్ధి రేసులో పరుగులు పెట్టించేందుకు చర్యలు చేపట్టారు రేవంత్. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ హయాంలో రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో 20 వేల ఎకరాల్లో ఒకేచోట హైదరాబాద్ ఫార్మా సిటీని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోగా.. ఆ ప్రాజెక్టును రేవంత్ సర్కార్ రద్దు చేసింది. భూ సేకరణ ఇబ్బందులు, ఫార్మా పరిశ్రమలతో కాలుష్య సమస్యలపై స్థానికుల అభ్యంతరాల వస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రత్యామ్నాయంగా వేర్వేరుచోట్ల సమీకృత గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. కాగా గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేసేందుకు వికారాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాలను తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. సొంత జిల్లా నుంచే... ఇదిలా ఉంటే తొలుత తన సొంత జిల్లాలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్. తన జిల్లాకు ఫార్మాసిటికల్ కంపెనీని తీసుకొచ్చి వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పట్టం కట్టారు. ఈ క్రమంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూసేకరణ కార్యక్రమం చేపట్టాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఇటీవల దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ను కూడా జారీ చేసింది. మొత్తం 3 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫార్మా సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫార్మా కంపెనీ కొరకు మొదటి విడతలో ప్రతిపాదించిన మొత్తం భూమి 1354 ఎకరాలు. అయితే.. ఈ కంపెనీ ఏర్పాటుకు అయ్యే భూమిని పోలేపల్లి, హకీంపేట్, లగచర్ల, రోటిబండా, పులిచర్ల కుంటతండా.. మొత్తం ఐదు గ్రామాల పరిధిలో రైతుల దగ్గర నుంచి సేకరించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ భూమి సేకరణ కోసం పోలేపల్లి లో 73 మంది, హాకింపెట్ లో 405 మంది, లగచర్ల లో 564 మంది రైతులకు నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే తొలుత లగచర్లలో 632.26 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ భూములను 580 మంది రైతుల నుంచి సేకరించనున్నారు. కాగా బాధిత రైతులకు 125 గజాల ఇంటి స్థలంతో పాటు ఎకరాకు 10 లక్షల నష్టపరిహారం, ఫార్మా సిటీలో కుటుంబానికి ఓ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. భూసేకరణలో దాడులు... రెండ్రోజుల క్రితం భూసేకరణ కోసం లగచర్ల గ్రామానికి వెళ్లిన అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. అక్కడికి వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్ తో పాటు వెళ్లిన అధికారులపై గ్రామస్థులు దాడి చేశారు. అయితే ఇది తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడిలో పాల్గొన్న కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడికి సంబంధించి పోలీసులు కీలక వివరాలు తెలిపారు. ఉద్దేశ్యపూర్వకంగా అధికారులు, కలెక్టర్‌ను పక్కకు తీసుకెళ్లిన బోగమోని సురేష్.. గ్రామస్థులను ఉసిగొల్పి దాడికి పాల్పడినట్లు చెప్పారు. ఇక నరేందర్ రెడ్డి.. సురేష్‌తో మాట్లాడుతూనే కేటీఆర్‌కు ఫోన్లు చేసినట్లు తేల్చారు. బోగమోని సురేష్‌పై రేప్ సహా పలు కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.అయితే.. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 55 మంది గ్రామస్థులను అదుపులోకి తీసుకుని పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ కేసులో అరెస్టులు ఇంకా కొనసాగుతున్నాయి. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి