BREAKING: మాజీ ఎంపీ ఇంట్లో విషాదం! TG: మాజీ ఎంపీ గొట్టే భూపతి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన భార్య శాంత కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కరీంనగర్‌లో మృతి చెందారు. గతంలో గొట్టే భూపతి రెండు సార్లు స్వతంత్ర అభ్యర్థిగా పెద్దపల్లి ఎంపీగా పనిచేశారు. By V.J Reddy 24 Nov 2024 in తెలంగాణ కరీంనగర్ New Update షేర్ చేయండి Gotte Bhupathi: మాజీ ఎంపీ గొట్టే భూపతి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన భార్య శాంత కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కరీంనగర్‌లో మృతి చెందారు. గతంలో గొట్టే భూపతి రెండు సార్లు స్వతంత్ర అభ్యర్థిగా పెద్దపల్లి ఎంపీగా పని చేశారు. వీరిది సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి గ్రామం కాగా.. వీరు కరీంనగర్ పట్టణంలో నివాసం ఉంటున్నారు. వీరికి సుధీర్ బాబు, సృజన్ బాబు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా.. గొట్టే భూపతి 1967 నుండి 1978 వరకు నేరెళ్ల శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా, 1983 నుండి 1989 వరకు పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అయితే నేరెళ్ల నియోజకవర్గం ప్రస్తుతం ఉన్న సిరిసిల్ల నియోజకవర్గంలో కలిసిపోయింది. #passedaway #ex mp wife #gotte bhupathi #shantha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి