Revanth Reddy: ప్రముఖ గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ గుస్సాడీ కనకరాజు మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుస్సాడీ నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయటంతో పాటు తెలంగాణ కళలను, సంస్కృతి సంప్రదాయాలకు ప్రాణం పోశాడు కనకరాజు. ఆయన మరణం తీరని లోటని రేవంత్ పేర్కొన్నారు.
Also Read: కేజ్రీవాల్ పై దాడి..వారి పనేనా అని అనుమానాలు!
గుస్సాడీ నృత్య ప్రదర్శనలతో పాటు ఇతరులకు నేర్పించటంలోనూ కనకరాజు తన విశేష సేవలు అందించినట్లు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అంతరించిపోతున్న ఆదివాసీల కళను దేశ వ్యాప్తంగా అందరికీ పరిచయం చేసిన కళాకారుడని.. ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. కనకరాజు కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు.
అధికారిక లాంఛనాలతో...
కాగా, గుస్సాడీ కనకరాజుకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామానికి చెందిన గుస్సాడీ కనకరాజు(70) శుక్రవారం అనారోగ్యంతో కన్ను మూశారు. శనివారం మర్లవాయిలో ఆదివాసీల సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం.
Also Read: శ్యామల తోపా..?..ఆమె కంటే మాకేం తక్కువ
ప్రతి సంవత్సరం దీపావళి సమయంలో గుస్సాడీ నృత్యంతో అందరినీ అలరించే కనకరాజు ఈసారి పండగకు నాలుగు రోజుల ముందే మరణించడంతో ఆదివాసీ గూడెల్లో విషాదం అలముకుంది.
ఆదివాసీల గుస్సాడీ నృత్యానికి గానూ 2021లో కనగరాజుకు భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ అవార్డును ప్రదానం చేసి గౌరవించింది.ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో 2021 నవంబరు 9న అవార్డును ప్రధానం చేసింది కేంద్ర ప్రభుత్వం.
Also Read: టీడీపీ ఎమ్మెల్యేలకు పవర్ లేదు.. ఆ రెండు ఇంకా వైసీపీ చేతుల్లోనే..?
కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామానికి చెందిన కనకరాజు.. ఆదివాసీ సంప్రదాయ గుస్సాడీ నృత్యంలో ప్రసిద్ధి చెందినవాడు. 55 సంవత్సరాలుగా గుస్సాడీ నృత్యాన్ని ప్రపంచం ముందుకు తీసుకుని వచ్చారు. ఆసక్తి చూపే వారికి శిక్షణ ఇస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. గుస్సాడీ నృత్యాన్ని ప్రదర్శిస్తూ.. నేర్పుతూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కనకరాజుకు 2021లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని బహుకరించింది.
Also Read: ఇజ్రాయెల్ ప్యాంట్ తడిసిపోతుందిగా.. కారణం ఇదే!
కనకరాజు నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఆయనకు ఇద్దరు భార్యలు, 12 మంది సంతానం. కనకరాజు మార్లవాయిలోని ఐటీడీఏ ఆశ్రమ స్కూల్లో రోజు కూలీగా పని చేసేవారు. ఆ సమయంలో కూడా ఆయన అందరికీ గుస్సాడీ నృత్యం చేసేవారు. 3, 4 నెలలకు ఒకసారి వచ్చే వేతనంతోనే ఆయన కుటుంబం మొత్తాన్ని గడిపేవారు. పద్మశ్రీ అవార్డ్ గ్రహీతతో స్కూల్ డ్యూటీ చేయించకూడదని ఐటీడీఏ ఆఫీసర్లు ఆయనను పనిలో నుంచి తీసేసారు. దాంతో కనకరాజుకు ఉపాధి కూడా దూరమైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన టీబీ బారిన పడి అనారోగ్యం పాలైయ్యారు.