Telangana MP's: రాజీనామాలు చేసిన తెలంగాణ ఎంపీలు
తెలంగాణ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు.
తెలంగాణ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు.
తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రైతుబంధు కింద పంట పెట్టుబడి సాయానికి నగదును ఖాతాలో జమచేసే ప్రక్రియను ఇవాళ్టి నుంచి రైతుల అకౌంట్లో డబ్బు జమ చేయాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందరికీ ఒకేరోజు రాకపోవచ్చు.
తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు. కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చితే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేదన్నారు.
నల్గొండ జిల్లా దేవరకొండలో లాకప్ డెత్ జరగడం కలకలం రేపింది. ఓ భూవివాదం కేసులో అరెస్టైన సూర్య నాయక్ అనే నిందితుడ్ని ఎస్సై సతీష్ రెడ్డి చితకబాదాడంతోనే మృతి చెందాడని.. సూర్య నాయక్ బంధువులు ఆరోపిస్తున్నారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
సివిల్ సప్లై , నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు తిరుపతి వెళ్లనున్నారు. తన మొక్కును తీర్చుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు గడ్డం తియ్యనన్నా ఉత్తమ్.. 10 ఏండ్లుగా గడ్డం తీయకుండా ఉన్నారు. కాంగ్రెస్ గెలవడంతో రేపు గడ్డం తీసుకోనున్నారు.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో భట్టి విక్రమార్క, సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి తొలిసారి మంత్రి అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం గతంలో మంత్రిగా పని చేయలేదు.
తెలంగాణలో 2014 నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో అర్హులైన కుటుంబాల సంఖ్య పెరిగిపోవడంతో కొత్తగా ఏర్పడబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాలు ఆశలు పెట్టుకున్నారు. ఆరు గ్యారంటీలతోపాటు ఈ ప్రక్రియను కాంగ్రెస్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన లేఖ రాశారు. రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో కాంగ్రెస్‌పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదన్నారు. ప్రజల ఆకాంక్షలు నేరవేర్చడం ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమన్నారు.
ఏపీలోని బాపట్ల ప్రాంతంలో మిచౌంగ్ తుఫాను మంగళవారం సాయత్రం తీరం దాటి.. ఆ తర్వాత క్రమంగా బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో మంగళవారం పలుచోట్ల వర్షాలు కరిశాయని.. బుధవారం కూడా పలు జిల్లల్లో వర్షాలు పడొచ్చని పేర్కొంది.