/rtv/media/media_files/2025/09/26/beerla-ilaiah-vs-mandula-samel-2025-09-26-13-23-11.jpg)
ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు భువనగిరి సమీపంలోని వివేరా హోటల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకున్నారని ఆరోపించారు. మీ బంధుత్వాల కోసం కాంగ్రెస్ ను బలిచేయొద్దన్నారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే బీర్ల ఐలయ్య నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ముసలం.
— RTV (@RTVnewsnetwork) September 26, 2025
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే "బీర్ల ఐలయ్య"పై సొంత పార్టీ ఎమ్మెల్యే మందుల సామేల్ సంచలన వ్యాఖ్యలు.
బీర్ల ఐలయ్య లఫంగి రాజకీయాలు చేయకు.
మదర్ డైరీ ఎన్నికల్లో మా ప్రాంత నాయకులు కొంతమంది BRS పార్టీ తో పొత్తు పెట్టుకుంటున్నారు.… pic.twitter.com/a7C4Eti238
మదర్ డెయిరీ ఎన్నికల్లో తన నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తుపెట్టుకునే హక్కు ఐలయ్యకు ఎవరు ఇచ్చారని సామేలు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని బొందపెట్టే కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తారు. ఈ పరిణామాలను కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరన్నారు. కాంగ్రెస్ ఓడితే కార్యకర్తలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు సామేలు.
బీర్ల ఐలయ్యపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్
— Telugu Scribe (@TeluguScribe) September 26, 2025
మధర్ డైరీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అన్ని బీఆర్ఎస్ పార్టీకి వేయిస్తున్నాడని, బీర్ల ఐలయ్యపై చర్యలు తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్‌ను కోరిన మందుల సామేల్ https://t.co/u4uOY3I3dmpic.twitter.com/bDHIVFpsPw
సామేలు వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఒకే జిల్లాకు చెందిన అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి తదితర అగ్ర నేతలు ఉన్నారు. వీరు ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల పంచాయితీని ఎలా పరిష్కరిస్తారన్న అంశం కూడా హాట్ టాపిక్ గా మారింది.
Follow Us