Nagarjuna: కేటీఆర్ వల్లే నటి సమంత, నాగచైతన్యకు విడాకులు అయ్యాయని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున స్పందించారు. దయచేసి రాజకీయాల్లోకి తమ కుటుంబాన్ని లాగొద్దని కోరారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు ఖండించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి అని అన్నారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి అని చెప్పారు. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం అని అన్నారు. తక్షణమే చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలని మంత్రి కొండా సురేఖను కోరారు.
KTR Vs కొండా..
మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇద్దరూ ఒకరిని ఒకరు తీవ్రంగా దూషించుకుంటున్నారు. కేటీఆర్ మినిస్టర్ గా ఉన్న టైంలో అనేక మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారన్నారు సురేఖ. ఆయనకు తల్లి అక్కా, చెల్లి లేరా? అంటూ ఫైర్ ఆయ్యారు. కేటీఆరే మహిళలను కించపరిచేలా పోస్టులు తన టీమ్ కు చెప్పారని సంచలన ఆరోపణలు చేశారు. దాంతో పాటూ గతంలో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, మంత్రి సీతక్కపై కూడా గతంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా అసభ్యకరంగా పోస్టులు పెట్టిందని ఫైర్ అయ్యారు. ఇప్పుడు బీసీ మహిళ అయిన తనను కించపరుస్తూ పోస్టులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా నాగచైతన్య-సమంత విడాకులు తీసుకోవడానికి కూడా కేటీఆర్ అని సంచలన ఆరోపణలు చేశారు సురేఖ. ఇంకా కొందరు హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోవటానికి, సినిమా ఇండస్ట్రీ నుంచి కొందరు హీరోయిన్లు బయటకు వెళ్ళిపోవడానికి గల కారణం కూడా కేటీఆర్ ఆరోపించారు. హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసింది నువ్వే కదా అంటూ కేటీఆర్‌ను ప్రశ్నించారు.
ప్రకాశ్ రాజ్ ట్వీట్..
ఇక దీనిపై నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. మంత్రి మాటలపై అసహనం వ్యక్తం చేశారు. సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే అంత చిన్న చూపా అని ట్వీట్ చేశారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ మండిపడ్డారు ప్రకాష్ రాజ్