సగటు అప్పుల్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్!

TG: రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,20,509 అప్పు ఉన్నట్లు నాబార్డ్ 2021-22 సర్వే తెలిపింది. సగటు సభ్యుల సంఖ్య 3.8 నుంచి 4.1కి చేరినట్లు పేర్కొంది. దేశంలో అప్పుల్లో ఉన్న కుటుంబాల్లో తెలంగాణ (92%), ఏపీ (36%) తొలి రెండు స్థానాలలోఉన్నట్లు తెలిపింది.

New Update
DEBTS

Average Debt:

తెలంగాణలో కుటుంబం సభ్యుల సంఖ్య పెరిగింది. ఒక్కో కుటుంబంలో సగటు సభ్యుల సంఖ్య 3.8 నుంచి 4.1కి చేరినట్లు నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే 2021-22లో తెలిపింది. ఈ సంస్థ 2016-17లో విడుదల చేసిన సర్వేలో ఈ సంఖ్య 3.8 కాగా, ఇప్పుడు 4.1కి చేరినట్లు వెల్లడించింది. రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,20,509 అప్పు ఉన్నట్లు పేర్కొంది. జాతీయ సగటు రూ.90,372 అప్పుల్లో ఉన్న కుటుంబాల సంఖ్య 79% నుంచి 92%కి పెరిగినట్లు చెప్పింది. జాతీయ సగటు 52%గా ఉన్నట్లు తెలిపింది. దేశంలో అప్పుల్లో ఉన్న కుటుంబాల్లో తెలంగాణ (92%), ఏపీ (36%) తొలి రెండు స్థానాలలో ఉన్నట్లు వివరించింది..

Advertisment
Advertisment
తాజా కథనాలు