తెలంగాణలో కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గండం! TG: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంశం కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్‌గా మారింది. అధిష్ఠానంపై ఆగ్రహంగా ఉన్న ఆయనను చల్లబరిచేందుకు ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అయన నివాసానికి మధుయాష్కీ, అడ్లూరి లక్ష్మణ్ వెళ్లారు. చాలాసేపు ఆయనతో చర్చలు జరిపారు. By V.J Reddy 26 Oct 2024 in తెలంగాణ కరీంనగర్ New Update షేర్ చేయండి MLC Jeevan Reddy: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఎపిసోడ్‌తో కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. జీవన్‌రెడ్డి రాజీనామా చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. కాగా అలిగిన జీవన్ రెడ్డిని బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్ హైకమాండ్. ఉమ్మడి జిల్లాల్లో కీలక నేతగా ఉన్న ఆయనను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఈరోజు ఆయన నివాసానికి మధుయాష్కీ, విప్ అడ్లూరి లక్ష్మణ్ వెళ్లారు. జీవన్‌రెడ్డితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పార్టీ పెద్దల తీరుపై తీవ్ర ఆగ్రహం, అనుచరుడు గంగారెడ్డి హత్యతో రగిలిపోతున్న జీవన్‌రెడ్డికి భరోసా నిచ్చేందుకు ఆయన నివాసానికి వెళ్లారు మధు యాష్కీ. ఇది కూడా చదవండి: నేను పోను బిడ్డో సర్కారు దవాఖానాకు: కేటీఆర్ కాంగ్రెస్ రాజ్యంలో బీఆర్ఎస్ పెత్తనం... ఇది కూడా చదవండి: వైసీపీ నేత సజ్జల అరెస్ట్‌పై కోర్టు కీలక తీర్పు! తెలంగాణలో రాజ్యమేలుతున్న కాంగ్రెస్ లో బీఆర్ఎస్ నేతల పెత్తనం కొనసాగుతుందని అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం లో కాంగ్రెస్ కార్యకర్తలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా జగిత్యాలలో పోలీసులు బీఆర్ఎస్ నేతల కనుసందుల్లో పని చేస్తున్నారని ఆరోపణలు చేశారు. కాగా ఇటీవల జగిత్యాలలో బీఆర్ఎస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన డాక్టర్ సంజయ్ కుమార్ ను తనకు తెలియకుండానే కాంగ్రెస్ లో చేర్చుకున్నారని జీవన్ రెడ్డి అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ సర్కార్‌కు ఊహించని షాక్! సంజయ్ చేరికను జీవన్ రెడ్డి వ్యతిరేకించారు. ఆనాడే పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించగా.. కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించడంతో తన రాజీనామా ఆలోచన నుంచి వెనుతిరిగారు. కాగా ఆరోజు నుంచి అధిష్టానంతు దూరంగా ఉంటున్న జీవన్ రెడ్డి.. తాజాగా తన ముఖ్య అనుచరుడు హత్యకు గురికావడంతో ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఇటీవల ఆయనకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేయగా.. తాను ఇక కొనసాగలేనని కాల్ చేయడం అనేక చర్చలకు దారి తీసింది. మరి జగ్గారెడ్డి కాంగ్రెస్ లో కొనసాగుతారా? లేదా? అనేది వేచి చూడాలి. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగ్ రిలీఫ్.. తప్పిన పదవి గండం! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి