రాహుల్ హస్తంలో హైడ్రా.. కేటీఆర్ సంచలన ఆరోపణలు

TG: రాహుల్‌ గాంధీ కోసమే హైడ్రా కూల్చివేతలు చేస్తుందని కేటీఆర్ అన్నారు. డబ్బు సంచుల కోసమే మూసీ ప్రాజెక్ట్‌కు రాహుల్‌ అనుమతి ఇచ్చాడని ఆరోపించారు. హైడ్రాను నడిపిస్తోంది రేవంత్‌ కాదు, రాహులే అని అన్నారు.

MLA KTR
New Update

MLA KTR: హైడ్రా కూల్చివేతలపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌గాంధీ కోసమే హైడ్రా కూల్చివేతలు చేస్తుందని అన్నారు. డబ్బు సంచుల కోసమే మూసీ ప్రాజెక్ట్‌కు రాహుల్‌ గాంధీ అనుమతి ఇచ్చాడని ఆరోపించారు. హైడ్రాను నడిపిస్తోంది రేవంత్‌ కాదు, రాహులే అని అన్నారు. పేదల ఇళ్లపైకి బుల్డోజర్లను పంపిస్తోంది రాహులే అని మండిపడ్డారు. బుల్డోజర్‌ ప్రభుత్వంతో హైదరాబాద్‌లో ప్రజలు చచ్చిపోతుంటే  రాహుల్‌ గాంధీ ఎక్కడ చచ్చిపోయాడు అని విమర్శించారు. ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు, మూసీ లూటీఫికేషన్ అని నిప్పులు చెరిగారు.

ఎక్కడున్నావ్ రాహుల్?

తెలంగాణలో చిన్నపిల్లోడు పిలిచినా సరే వస్తానన్న రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ సచ్చాడో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఢిల్లీ డబ్బుల కట్టల కోసమే రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం పేదల ఇళ్లను కూల్చేయిస్తోందని ఆరోపించారు. మీరు ఈ ప్రాజెక్ట్ ఏ కాంట్రాక్టర్‌కు ఇస్తారో కూడా తమకు తెలుసు అని అన్నారు. ఆ వివరాలను త్వరలోనే బయటపెడతానని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానానికి మూసీ నోట్ల కట్టలు కావాలని అన్నారు.మరి మూసీ బాధితుల కష్టాలు కాంగ్రెస్ అధిష్టానానికి పట్టవా అని ప్రశ్నించారు.

హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆటలు..

కేటీఆర్ పై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి కొండా సురేఖ. ఆయన మినిస్టర్ గా ఉన్న టైంలో అనేక మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారన్నారు. కేటీఆర్ కు తల్లి అక్కా, చెల్లి లేరా? అంటూ ఫైర్ ఆయ్యారు. కేటీఆరే మహిళలను కించపరిచేలా పోస్టులు తన టీమ్ కు చెప్పారని సంచలన ఆరోపణలు చేశారు. గతంలో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, మంత్రి సీతక్కపై కూడా గతంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా అసభ్యకరంగా పోస్టులు పెట్టిందని ఫైర్ అయ్యారు. ఇప్పుడు బీసీ మహిళ అయిన తనను కించపరుస్తూ పోస్టులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా నాగచైతన్య-సమంత విడాకులు తీసుకోవడానికి కూడా కేటీఆర్ అని సంచలన ఆరోపణలు చేశారు సురేఖ. ఇంకా కొందరు హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోవటానికి కూడా కేటీఆరే కారణమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు ఎలా స్పందిస్తారనే అంశం ఉత్కంఠగా మారింది. 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe