RRR దక్షిణ భాగం రోడ్డు కింద మునుగోడు నియోజకవర్గంలో భూములు భూనిర్వాసితులు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిశారు. దక్షిణ భాగంలో అలైన్మెంట్ ను మార్చారని, దివిస్ కంపెనీకి లాభం చేకూరేలా చేస్తున్నారని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. భూమిపోతే తమకు జీవితమే పోతుందని,తమకు న్యాయం చేయాలని కోరుతూనే, భూమికి భూమి ఇవ్వడమే మా నినాదం అని భూనిర్వాసితులు ఆయనను కోరారు.
భూమికి రైతుకు మధ్య
అనంతరం ఎమ్మెల్యే కోమటిరెడ్డి మాట్లాడుతూ.. భూమికి రైతుకు మధ్య భావోద్వేగ బంధం ఉంటుందన్నారు. ఇది చాలా సున్నితమైన సమస్య అని చెప్పారు. పార్టీ కంటే, ప్రభుత్వం కంటే ప్రజలే ముఖ్యం అనే బావనతో ఆలోచన చేస్తున్నానని తెలిపారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయడానికి RRR దక్షిణ భాగం రహదారి వెళ్తున్న నియోజకవర్గాల శాసనసభ్యులతో కూడా తాను మాట్లాడుతున్నానని వెల్లడించారు. ఈ విషయంలో అందరు ఎమ్మెల్యే లు ఆవేదనతోనే ఉన్నారని రాజగోపాల్ అన్నారు.
అధికార పార్టీలో ఉన్నప్పటికీ తాను ప్రజల పక్షాన మాట్లాడతానని, పదవి అంటే కిరీటం కాదు బాధ్యత అని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ధర్మం, న్యాయం వైపు తాను ఉంటానని తెలిపారు. సగం మునుగోడు నియోజకవర్గం RRR లోనే కలుస్తుందన్నారు. అలైన్ మెంటు మార్చడానికి కారణాలను రైతులకు వివరించి ఒప్పించి నిర్ణయం తీసుకోవాలని వెల్లడించారు. మీకు న్యాయం చేసేవారి వైపు, మీకోసం కొట్లాడే వారి వైపు ఉండాలిని పిలుపునిచ్చారు.
ఉత్తర భాగంలోనే అలైన్ మెంట్ విషయంలో తప్పు జరిగిందని, ఇపుడు దక్షిణ భాగంలో కూడా ఆ తప్పును కొనసాగిస్తున్నారని అన్నారు. RRR వెళ్లే నియోజకవర్గ ఎమ్మెల్యేలం అందరం కలిసి ముఖ్యమంత్రితో మాట్లాడుతామని రాజగోపాల్ వెల్లడించారు. ఇక 2017 లో శివన్నగూడెం ప్రాజెక్టును ప్రారంభించారు కానీ పరిహారం మాత్రం 2023లో తాను రాజీనామా చేసిన తరువాత పూర్తి చేశారని అన్నారు రాజగోపాల్.
MLA Komatireddy : రేవంత్ పై మరోసారి రెచ్చిపోయిన ఎమ్మెల్యే కోమటి రెడ్డి..సంచలన కామెంట్స్
RRR దక్షిణ భాగం రోడ్డు కింద మునుగోడు నియోజకవర్గంలో భూములు భూనిర్వాసితులు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిశారు. దక్షిణ భాగంలో అలైన్మెంట్ ను మార్చారని, దివిస్ కంపెనీకి లాభం చేకూరేలా చేస్తున్నారని తమ ఆవేదనను వ్యక్తం చేశారు.