Sangareddy: బొల్లారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం.. పేలిన రెండు రియాక్టర్స్..
సంగారెడ్డి జిల్లా పరిధిలోని బొల్లారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అమర్ ల్యాబ్స్‌లో భారీ శబ్ధంతో రెండు రియాక్టర్లు పేలిపోయాయి. ఈ ఘటనలో 9 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానికి ఆస్పత్రికి తరలించారు. కాగా, నైట్ షిఫ్ట్‌లో 15 మంది కార్మికులు పని చేస్తున్నట్లు సమాచారం.