డెడ్‌బాడీకి ట్రీట్‌మెంట్... మల్లారెడ్డి ఆస్పత్రిలో ఠాగూర్‌ సీన్‌ రిపీట్‌!

మల్లారెడ్డి హాస్పటల్ యాజమాన్యం డెడ్ బాడీకి ట్రీట్ మెంట్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నెల 4న కిడ్నీలో రాళ్ల సమస్యతో చేరిన మహిళ ఆపరేషన్ ఫెయిల్ కావడంతో చనిపోయిందని బంధువులు చెబుతున్నారు. ఆస్పత్రి సీజ్ చేయాలని వారు ఆందోళన చేస్తున్నారు.

New Update

హైదరాబాద్‌లోని మల్లారెడ్డి హాస్పిటల్‌లో దారుణం చోటు చేసుకుంది. ఠాగూర్ సినిమాలో మాదిరిగా డబ్బుల కోసం మృతదేహానికి ట్రీట్ మెంట్ చేసినట్లు నమ్మించారన్న ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 4వ తేదీన కిడ్నీలో రాళ్లు వచ్చాయని మాధవి అనే మహిళ హాస్పిటల్ లో చేరింది. అయితే సర్జరీ ఫెయిల్ కావడంతో ఆ మహిళ మృతి చెందిందని బంధువులు చెబుతున్నారు. అయితే డబ్బుల కోసం మృతదేహానికి ట్రీట్‌మెంట్ చేసినట్లు నటించారని వారు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ ఫెయిల్ అయిన విషయాన్ని తమకు చెప్పకుండా దాచారని.. వెంటలేటర్ పై ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నామని నమ్మించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: BIG BREAKING: బయటకు వచ్చిన కేసీఆర్.. రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు!

సర్జరీ చేసిన జూనియర్ డాక్టర్లు..

జూనియర్‌ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే సర్జరీ ఫెయిల్‌ అయిందని బంధువుల ఆరోపిస్తున్నారు. దీంతో ఈ రోజు ఉదయం నుంచి హాస్పిటల్‌ ముందు బంధువులు ధర్నా చేస్తున్నారు. ఆసుపత్రిని సీజ్ చేయాలంటూ బంధువుల డిమాండ్ చేస్తున్నారు. బాధిత మహిళకు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగానే మధవి మృతి చెందిందని.. ఆ ఇద్దరు చిన్నారులు అనాథలు అయ్యారని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే.. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: కేటీఆర్ అరెస్టును ఆపుతున్నది ఆయనే.. ఆ ఒక్కరు ఓకే అంటే జైలుకే..?

ఇటీవల మల్లారెడ్డికి నోటీసులు..

మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. గత ఏడాది జూన్ లో ఈడీ మల్లారెడ్డికి సంబంధించి కాలేజీలు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించింది. పలు డాక్యుమెంట్లను, హార్డ్ డిస్క్ లను సీజ్ చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ సోదాల్లో మల్లారెడ్డి కాలేజీల్లో ఆర్థిక అవకతవకలను గుర్తించనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. 

#mallareddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe