నేను హైడ్రా వెంట ఉండను: మధుయాష్కీ

TG: హైడ్రాపై మధుయాష్కీ గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా వైపా, ప్రజల వైపా అంటే తాను ఎప్పుడూ ప్రజలకే అండగా ఉంటానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకోదని చెప్పారు.

New Update
Lok Sabha Elections: కాంగ్రెస్‌ నేత మధుయాష్కీ ఇంట్లో తనిఖీలు

Madhu Yashki Goud: హైడ్రాపై మధుయాష్కీ గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రజల వైపే ఉంటానని అన్నారు. హైడ్రా వైపా, ప్రజల వైపా అంటే తాను ఎప్పుడూ ప్రజలకే అండగా ఉంటా అని చెప్పారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి భూకబ్జాదారుడని మండిపడ్డారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్ని కబ్జా చేశాడని ఆరోపణలు చేశారు.

ఇప్పుడు దొంగ మాటలు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. గతంలో పొంగులేటికి కేటీఆర్‌ ఎందుకు కాంట్రాక్ట్‌లు ఇచ్చారు అని ప్రశ్నించారు. ముందుగా కేటీఆర్‌పైనా ఈడీ, ఐటీ దాడులు జరగాలని అన్నారు. ఎవరో చెబితే కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకోదని తెలిపారు. తాను అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ వెంటే 3 రోజులు ఉన్నానని చెప్పుకొచ్చారు.

ఎక్కడున్నావ్ రాహుల్?

తెలంగాణలో చిన్నపిల్లోడు పిలిచినా సరే వస్తానన్న రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ సచ్చాడో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఢిల్లీ డబ్బుల కట్టల కోసమే రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానం పేదల ఇళ్లను కూల్చేయిస్తోందని ఆరోపించారు. మీరు ఈ ప్రాజెక్ట్ ఏ కాంట్రాక్టర్‌కు ఇస్తారో కూడా తమకు తెలుసు అని అన్నారు. ఆ వివరాలను త్వరలోనే బయటపెడతానని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానానికి మూసీ నోట్ల కట్టలు కావాలని అన్నారు.మరి మూసీ బాధితుల కష్టాలు కాంగ్రెస్ అధిష్టానానికి పట్టవా అని ప్రశ్నించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు