/rtv/media/media_files/2026/02/13/madhav-reddy-loss-2026-02-13-11-40-44.jpg)
బీసీలకు 42శాతం రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేసిన నేతకు ఓటర్లు బిగ్ షాక్ ఇచ్చారు. రెడ్డి జాగృతి వ్యవస్థాపకుడు బుట్టం గారి మాధవరెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేశవాపూర్ వార్డు నుంచి ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో మాధవరెడ్డి తన సమీప ప్రత్యర్థి చేతిలో కేవలం 50 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు.
బీసీ రిజర్వేషన్ అడ్డుకున్నందుకు ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మాధవరెడ్డి ఓటమి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం కావడానికి ప్రధాన కారణం ఆయన గతంలో వేసిన కోర్టు కేసులే. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంపై వెనుకబడిన వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలపై, ఎన్నికల నిర్వహణపై ఆయన వేసిన కోర్టు కేసులు అప్పట్లో రాజకీయ దుమారం రేపాయి.
రిజర్వేషన్ల ప్రక్రియకు అడ్డుపడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్న మాధవరెడ్డిని, స్థానిక ఓటర్లు ఈ ఎన్నికల్లో తిరస్కరించారు. అధికార పార్టీ మద్దతు ఉన్నప్పటికీ, వ్యక్తిగత ఇమేజ్, వివాదాల కారణంగా ఆయన విజయం సాధించలేకపోయారు.
Follow Us