కౌశిక్ రెడ్డి ఇంటికి హరీశ్ రావు.. భారీ కాన్వాయ్ తో సిద్దిపేట నుంచి..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య వివాదం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీశ్ రావు హుటాహుటిన సిద్దిపేట నుంచి కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు.

Harish-Rao-Koushik-Reddy
New Update

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసంపై దాడి విషయాన్ని తెలుసుకున్న హరీశ్ రావు.. సిద్దిపేట నుంచి కౌశిక్ రెడ్డి నివాసానికి బయలుదేరారు. దీంతో ఆయనను పోలీసులు అనుమతిస్తారా? లేదా అన్న విషయంపై టెన్షన్ నెలకొంది. అంతకు ముందు హరీశ్ రావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఇదేం ప్రజాస్వామ్యం? ఇదేం ప్రజాపాలన? ఇదేం ఇందిరమ్మ రాజ్యం? అని ప్రశ్నలు గుప్పించారు. మా పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడంతో పాటు, వారినే ఉసిగొల్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. 

కాంగ్రెస్ పార్టీ విద్రోహ, వికృత, అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో జరిగిన దాడి ఇదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాళ్లు, గుడ్లు, టమాటాలతో మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మంది మార్బలంతో వెళ్లి దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందన్నది సుస్పష్టమన్నారు.

 

ఇంటి మీదకు వస్తామని ప్రెస్ మీట్ లో ప్రకటించి, అనుచరులతో దాడి చేసినప్పటికీ నిలువరించడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ తీవ్రంగా విఫలమైందని ఫైర్ అయ్యారు. పట్టపగలు ప్రజాప్రతినిధి మీద జరిగిన ఈ దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. దాడి చేసిన గాంధీని, అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం

#harish-rao #mla-koushik-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe