ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి పక్కా.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరికి మంత్రి పదవి పక్కా అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందనేది తాను చెప్పలేదనన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తా అనే నమ్మకం కేసీఆర్ కు లేదన్నారు.

New Update
Minister Komatireddy: బీఆర్‌ఎస్ భూస్థాపితమవుతుంది.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

పాలమూరు జిల్లా నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ఖచ్చితంగా మంత్రి పదవి రావడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో మంత్రి వర్గ విస్తరణ ఎవరికి పదవులు అనేది ఎవరు చెప్పలేరన్నారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ రోజు చిట్ చాట్ చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం కేసీఆర్ కు లేదన్నారు. అందుకే అసెంబ్లీ వస్తలేడన్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నపుడు భట్టి విక్రమార్క అసెంబ్లీకి వచ్చారని గుర్తు చేశారు. అయితే.. 30 మంది ఎమ్మెల్యేలు  ఉన్న కేసీఆర్ ఎందుకు వస్తలేడని ప్రశ్నించారు. ⁠

హుందాతనం అవసరం..

రాజకీయాల్లో హుందాతనం అవసరమన్నారు. కేటీఆర్, హరీష్ రావుకు అవి లేవన్నారు. డీలిమిటేషన్ లో 34 అసెంబ్లీ సీట్లు, 7 ఎంపీ సీట్లు పెరుగుతాయన్నారు. జమిలీ డ్రాఫ్ట్ రెడీ అయిందని అంటున్నారన్నారు. మా సీఎం, మంత్రులు పబ్లిక్ కు అందుబాటులో ఉంటున్నామన్నారు. ప్రతిపక్ష హోదా లేకున్నా ఖర్గే, అదిర్ రంజాన్ చౌదరి పార్లమెంట్ కు వెళ్లారన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. 

ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ కూడా ఓడిపోయారన్నారు. 2019లో తన మీద ఎంపీగా గెలిచేందుకు అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య కోట్లు ఖర్చు పెట్టారన్నారు. అయినా తానే గెలిచానన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నేత పాత్ర పోషించాలన్నారు. మంత్రిగా ఏ ప్రశ్నకైనా తాను జవాబిస్తానన్నారు. ప్రజల్లో పరపతి లేని కేటీఆర్, హరీష్ గురుంచి మాట్లాడొద్దని సీఎంకు సూచించానన్నారు.  

#komatireddy-venkatreddy
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు