Kishan Reddy: హైడ్రాపై మరోసారి విమర్శల దాడికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎక్కువ శాతం కాంగ్రెస్ హయంలోనే మూసీ పరివాహక ప్రాంతంలో నిర్మాణాలు కట్టారని అన్నారు. 40 ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్నారని చెప్పారు. ప్రభుత్వమే వారికి అన్ని వసతులు కల్పించిందని అన్నారు. ఈరోజు వాటిని కులగొడతం అనడం సరికాదని అన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో ధనవంతులు ఎవరు ఉండరని అన్నారు.
తొందరపాటు నిర్ణయాలు తగదు...
కులగొట్టడం అనేది అంత తేలిక కాదని అన్నారు. దానికి పెద్ద సాహసమే చేయాల్సి వస్తాదని చెప్పారు. సీఎం అక్కడి ప్రజలతో దర్బార్ పెట్టి ఒప్పించి కులగొట్టామని చెప్పండి అని అన్నారు. రిటైనింగ్ వాల్ కట్టి మూసి సుందికరణ చేయొచ్చని అభిప్రాయపడ్డారు. డ్రైనేజీ వ్యవస్థ అంతా ముసిలోనే కలుస్తుందని అన్నారు. డ్రైనేజీ కి ప్రత్యామ్నాయం లేకుండా సుందరీకరణ ఎలా? అని ప్రశ్నించారు. గంగా సుందరీకరణ కోసం చాలా తక్కువ ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. లక్ష యాభై వేల కోట్లు అంటే ఎక్కడి నుంచి తెస్తారు? అని అడిగారు. ఎందుకు అంత డబ్బు ఖర్చు అవసరం? అని అన్నారు. హైడ్రా పై తొందరపాటు నిర్ణయాలు తగదని సూచించారు.