BREAKING: తెలంగాణలో భారీగా IPSల బదిలీలు
తెలంగాణలో భారీగా IPSల బదిలీలు జరిగాయి. దీనికి సంబంధించిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. టెక్నికల్ సర్వీసెస్ అదనపు డీజీగా వి.వి.శ్రీనివాసరావు, డీఐజీ కోఆర్డినేషన్‌గా గజారావు భూపాల్ ను నియమించింది.
తెలంగాణలో భారీగా IPSల బదిలీలు జరిగాయి. దీనికి సంబంధించిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. టెక్నికల్ సర్వీసెస్ అదనపు డీజీగా వి.వి.శ్రీనివాసరావు, డీఐజీ కోఆర్డినేషన్‌గా గజారావు భూపాల్ ను నియమించింది.
ఎంపీ ఎన్నికల్లో సిట్టింగ్ లను మార్చాలని భావిస్తున్న కేసీఆర్.. మహబూబాబాద్ ఎంపీ టికెట్ ను ఐఆర్ఎస్ అధికారి జీవన్ లాల్ కు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రచారం సాగుతోంది. నియోజకవర్గ ప్రజలకు న్యూఇయర్ శుభాకాంక్షలు తెలుపుతూ జీవన్ లాల్ పేరుతో వెలసిన ఫ్లెక్సీలు ఈ చర్చకు కారణమయ్యాయి.
సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్ పదవీకాలం శనివారంతో ముగిసింది. 2015 నుంచి జనవరి 1వ తేదీ నుంచి ఆయన ఈ పదవిలో ఉన్నారు. శ్రీధర్ ను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి నూతన సీఎండీ గా డైరెక్టర్ ఫైనాన్స్ బలరాంకు అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం.
పాలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు కందాల ఉపేందర్‌రెడ్డి భూ వివాదంలో అడ్డంగా బుక్ అయ్యారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నం.3లో ఓ స్థలాన్ని కబ్జా చేసినట్లు షేక్‌పేట తహసీల్దార్ అనితారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇప్పటికే రైతుబంధు, పెన్షన్లను పొందుతున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని ఆయన స్పష్టం చేశారు. కొత్తవారు మాత్రమే ఈ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఎన్నికల తర్వాత సీపీఎం నేతలు సీఎం రేవంత్ రెడ్డిని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలన్న ఆలోచనపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
నిన్న రేవంత్ రెడ్డి ఫొటో లేకుండా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసి చర్చకు తెరలేపిన కోమటిరెడ్డి.. తాజాగా మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఉన్న ఫొటోలు, సలార్ సాంగ్ ను కలిగి ఉన్న వీడియోను షేర్ చేశారు.
ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజలు నుంచి మంచి స్పందన లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా మూడురోజుల్లో ప్రజల నుంచి 40.57 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈరోజు, రేపు దరఖాస్తుల స్వీకరణకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.
రోడ్లు,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఉన్న ఫొటో ఉంచి కలిసి కొత్త శకాన్ని నిర్మిద్దాం అంటూ క్యాప్షన్ తో పోస్టు చేశారు.