Certificates: ముంపు బాధితులకు కొత్త సర్టిఫికెట్లు!

ఖమ్మం జిల్లాలోని ముంపు బాధితులకు కొత్త సర్టిఫికెట్లు అందజేయనుంది రాష్ట్ర సర్కార్‌. ఈ క్రమంలో ఖమ్మం కార్పొరేషన్‌లో పరిధిలో 14 కేంద్రాలను, జిల్లా వ్యాప్తంగా 72 బృందాలను జిల్లా యంత్రంగం ఏర్పాటు చేసింది.

author-image
By V.J Reddy
New Update
Vijayawada Floods

Certificates: ఇటీవల భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లాని వరదలు ముంచెత్తాయి. భారీ వరద కారణంగా ఇండ్లు, రోడ్లు నీటమునిగాయి. ఇంట్లోకి నీళ్లు చేరడంతో రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు వంటి ముఖ్యమైన సెర్టిఫికెట్లు తడిసిపోవడం, మరికొన్ని చోట్ల వరదకు సర్టిఫికెట్స్ కొట్టుపోయాయి. కాగా తడిసిన సర్టిఫికెట్లను కొందరు గాలికి ఆరబెట్టారు. ఇదిలా ఉంటే ఇటీవల ఖమ్మం జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు బాధితులకు భరోసా ఇచ్చారు. వరద నష్టం కింద రూ.10వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

కొత్త సర్టిఫికెట్లు..

వరదలతో కొట్టుకుపోయిన, తడిసి బురదమయమైన సర్టిఫికెట్ల స్థానంలో కొత్తవి ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం వరద బాధితులకు హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ ఆదేశాలతో జిల్లా యంత్రం కార్యాచరణ మొదలు పెట్టింది. బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. సర్టిఫికెట్లు కానీ, ఇతర ప్రభుత్వానికి సంబంధించిన పత్రాల తడిసిన, కొట్టుకుపోయిన స్థానంలో కొత్తవి కావాలను కునే వారి నుంచి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇందుకోసం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 14 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయగా.., జిల్లా వ్యాప్తంగా 72 బృందాలు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. 20 రకాల సర్టిఫికెట్ల వివరాలు సేకరించి కొత్తగా వాటిని బాధితులకు అప్పగించనున్నారు. ఈనెల 20 వరకు దరఖాస్తుల స్వీకరణ చేయనుంది. సర్టిఫికెట్లు కావాల్సిన వారు ఏదైనా సమస్య ఉంటే 1077కు కాల్‌ చేయొచ్చు.

డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు..

కాగా కొందరు అధికారులు చేతి వాటం చూపిస్తున్నారు. కొత్త సెర్టిఫికెట్లు కావాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రభుత్వ దృష్టికి బాధితులు తీసుకెళ్లగా.. ప్రభుత్వం వారిపై సీరియస్ అయింది. ఎవరైనా కొత్త సర్టిఫికెట్ల కోసం ప్రజల నుంచి డబ్బు తీసుకుంటే వారిని కఠినంగా శిక్షిస్తామని.. ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది. ఏ అధికారికి డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదని.. ఉచితంగా మీ పత్రాలను ప్రభుత్వం అందిస్తుందని తెలిపింది.

వివరాల నమోదు నుంచి ఒరిజినల్‌ సర్టిఫికెట్ల జారీ వరకు అంతా ఉచితంగానే సేవలు అందించనుంది. విద్యార్హత సర్టిఫికెట్లు, బర్త్, డెత్ ధ్రువీకరణ, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, వ్యవసాయ పట్టాదారు పాస్‌ పుస్తకాలు, గ్యాస్‌ బుక్‌లు వంటి అన్ని రకాల పత్రాలను నెల రోజుల్లోగా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.

Advertisment
తాజా కథనాలు