Bhadradrikottagudem District : ప్రపంచమంతా సాంకేతిక పరిజ్ఞానంతో పరుగులు పెడుతుంటే.. కొంతమంది మాత్రం ఇంకా మూఢనమ్మకాల పేరుతో దారుణాలకు పాల్పడుతున్నారు. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు ఇద్దరు మూర్ఖులు. ఈ ఘటన భద్రాధ్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం రాచబండ్ల కోయగూడెంలో చోటుచేసుకుంది.
Also Read: Bhargavi Nilayam: ఏడాది తర్వాత ఓటీటీలో టోవినో థామస్ థ్రిల్లర్ 'భార్గవి నిలయం' - Rtvlive.com
కుంజా బిక్షం హత్య
కోయగూడెం గ్రామంలో కుంజా బిక్షం (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే గత రాత్రి కుంజా బిక్షం అనుమానాస్పదంగా మృతి చెందాడు. గ్రామసమీపంలోని స్థానిక వాగులో మృతదేహమై కనిపించాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా... మృతదేహంపై పలుచోట్ల గాయాలు ఉన్నట్లు గుర్తించారు. రాళ్లతో ముఖంపై విచక్షణా రహితంగా దాడి చేసి.. అతను మృతి చెందిన తర్వాత శవాన్ని వాగులో పడేసినట్లు పోలీసులు అంచనా వేశారు.
Also Read: Married Couples : కొత్తగా పెళ్లయిందా? ఈ మూడు పాటిస్తే మీ భార్య మిమల్ని ఎప్పటికీ వదలదు!
చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో హత్య
అయితే గత రాత్రి అదే గ్రామానికి చెందిన కుంజా ప్రవీణ్, మల్కం గంగయ్య.. కుంజా బిక్షంను మద్యం సేవించేందుకు గ్రామ సమీపంలోని చెక్ డ్యాం వద్దకు తీసుకెళ్లినట్లు తెలిసింది. అప్పటికే కుంజాబిక్షం తమ కుటుంబం పై చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో అతని పై కక్ష పెట్టుకున్న ప్రవీణ్, గంగయ్యలే అతన్ని హత్యచేసి ఉంటారని గ్రామస్థులు చెప్పారు. మరో వైపు కుంజాబిక్షంకు ఎలాంటి మంత్రాలు, చేతబడులు రావని కక్షతోనే ఇదంతా చేశారని అతని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు ప్రవీణ్, గంగయ్యను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియనున్నాయి.
ఇది కూడా చదవండిః కొడుకుని మింగిన ఆన్ లైన్ బెట్టింగ్.. దారుణానికి పాల్పడ్డ తల్లి!
Also Read : కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ వద్ద రిపోర్టు.. వాళ్లపై సీరియస్