Ganesh Nimajjan: భాగ్య నగరంలో గణేశ్ నిమజ్జన శోభ యాత్ర మొదలైంది. ఖైరతాబాద్ గణేశుడు ఇప్పుడే గంగమ్మ ఒడి చేరేందుకు పయనమమయ్యాడు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేశారు. అన్ని శాఖల అధికారులు వారి పనుల్లో నిమగ్నమయ్యారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ప్రారంభమైన ఖైరతాబాద్ బడా గణేష్ శోభా యాత్ర
ఖైరతాబాద్ గణేషుడు మరి కొన్ని గంటల్లో హూస్సేన్ సాగర్ లో గంగమ్మ ఒడిని చేరేందుకు రెడీ అయిపోయాడు. ఖైరతాబాద్ గణేషుడికి 70 ఏళ్లు సందర్భంగా 70 అడుగుల ఎత్తులో భారీ మట్టి గణేషున్ని ఏర్పాటు చేసిన ఖైరతాబాద్ గణేష్ కమిటీ సిబ్బంది. ఈ ఏడాది శ్రీ సప్త ముఖ మహాశక్తి గణపతి గా భక్తుల పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణపతి. కుడి వైపున శ్రీ నివాస కళ్యాణం ఎడమ వైపున పార్వతీ కళ్యాణం..భారీ విగ్రహం కాళ్ళ వద్ద అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు.
పర్యావరణ హితంగా ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ ఏడాది బడా గణేష్ విగ్రహం..ఆలస్యంగా ప్రారంభం అయినా అనుకున్న సమయానికి విగ్రహం ఏర్పాటు పూర్తయ్యింది.ఈ ఏడాది కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి బడా గణేష్ విగ్రహం ఏర్పాటు చేశారు.
ఈ ఏడాది కొలువు తీరిన ఖైరతాబాద్ గణేష్ బరువు సుమారు 40 నుంచి 50 టన్నులు ఉంది. దీనిలో పెద్ద ఎత్తున ఐరన్, పిచూ.. మట్టిని వినియోగించారు. అర్ధ రాత్రి తర్వాత కలశ పూజ జరిగిన తరువాత ట్రాలీ పైకి ఎక్కిన ఖైరతాబాద్ గణేశుడు. ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర మొత్తం రెండున్నర కిలో మీటర్ల మేర సాగనుంది .ఖైరతాబాద్ , సెన్సేషనల్ థియేటర్ , రాజ్ దూత్ హోటల్ , టెలిఫోన్ భవన్ , తెలుగు తల్లి ఫ్లై ఓవర్ , సెక్రటేరియట్ , NTR మార్గ్ వరకు శోభాయాత్ర కొనసాగనుంది .ఎన్టీఆర్ మార్గ్ లో ఏర్పాటు చేసిన 4 వనెంబర్ క్రేన్ ద్వారా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరగనుందచి . హుస్సేన్ సాగర్ లో మధ్యాహ్నం 2 లోపు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి అయ్యేలా అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు.